
ఒకప్పుడు తెలుగు సినిమా నిర్మాణంలో సక్సెస్ కి సమానార్థకమైన పేరు – దిల్ రాజు. ప్రతి సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో దర్శకులు, హీరోలు ఆయన దగ్గర క్యూ కట్టేవారు. కానీ కాలం కొంచెం ప్రక్కకు తప్పుకుంది. భాక్సాపీస్ కరుణించటం మానేసి చాలా కాలం అయ్యింది. దాంతో తెలుగులో హీరోల డేట్స్ కూడా దొరకని సిట్యువేషన్.
సరే అని బాలీవుడ్ లో రాణించాలని ఆయన చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ‘జెర్సీ’ (షాహిద్ కపూర్‌తో) , ‘హిట్ 2’ రీమేక్ లు రెండు కూడా ఫ్లాప్ కావడంతో దిల్ రాజు కాస్త వెనక్కి తగ్గారు. ఆ దెబ్బతో, “ఇప్పుడే కాదు, తర్వాత చూద్దాం” అని ముంబయి ప్రయాణానికి బ్రేక్ ఇచ్చారు.
కానీ ఇప్పుడు ఆయన మళ్లీ రంగంలోకి దూసుకువస్తున్నారు – అది కూడా సల్మాన్ ఖాన్ తో! బాలీవుడ్ లో మరోసారి బిగ్ గ్యాంబిల్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు దిల్ రాజు.
ఇక ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న సీన్ కూడా ఆసక్తికరం – దర్శకుడు వంశీ పైడిపల్లి మొదట తన కథని అమీర్ ఖాన్ కి వినిపించారు. కానీ ఫైనల్ స్క్రిప్ట్ చదివిన తర్వాత అమీర్ పెద్దగా ఎక్సైటవ్వలేదు. దాంతో వంశీ మరో కొత్త కథతో సల్మాన్ ఖాన్ ని కలిశారు. సల్మాన్ కి అది నచ్చింది.
అక్కడి నుంచే దిల్ రాజు ఎంట్రీ – “వంశీ సినిమా అంటే నేనే!” అన్నట్టుగా ఆయన మళ్లీ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు.
వాస్తవానికి, ‘మున్నా’, ‘బృందావనం’, ‘మహర్షి’, ‘ఎవడు’, ‘వారిస్’ – వంశీ పైడిపల్లి తీసిన చాలా సినిమాల వెనుక దిల్ రాజు ఉన్నారు. ఇద్దరి కలయిక అంటే గ్యారెంటీడ్ క్లాస్-మాస్ మిక్స్.
అందుకే, గతంలో బాలీవుడ్ లో చేదు అనుభవాలు ఉన్నా… ఈసారి సల్మాన్ ఖాన్ కాంబినేషన్ తో దిల్ రాజు తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు.
ఇండస్ట్రీలో టాక్ ఒకటే –
“దిల్ రాజు బాలీవుడ్ లో రివెంజ్ టూర్ మొదలుపెట్టేశాడు!”
ఈసారి గెలుస్తారా? లేక మరోసారి ఫ్లాప్ ట్రాప్ లో పడతారా?
అదే చూడాలి!
