సినిమాల కంటే హాట్ ఫొటోషూట్లతో ఎక్కువ బజ్ క్రియేట్ చేసే టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి మళ్లీ వివాదాల్లో ఇరుక్కుంది.

టాలీవుడ్ బ్యూటీ డింపుల్ హయాతి మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి మాత్రం ఇంటి పనిమనుషుల కూలి వివాదం కారణంగా ఆమె పేరు చర్చల్లోకి వచ్చింది. ‘ఖిలాడి’ (రవి తేజ), ‘రామాబాణం’ (గోపిచంద్) సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డింపుల్ హయాతి, 2023లో తన అపార్ట్‌మెంట్‌లో ఉన్న ఓ IPS అధికారితో జరిగిన గొడవ కారణంగా కూడా హెడ్లైన్స్‌లో నిలిచింది.

ఇప్పుడు మాత్రం… ఒడిశా నుంచి వచ్చిన ఇద్దరు యువతులను కుక్కలను చూసుకోవడానికి పని పెట్టుకున్న డింపుల్ హయాతి, తన లైవ్–ఇన్ పార్టనర్‌తో కలిసి వారిని అవమానించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం, డింపుల్ హయాతి లైవ్-ఇన్ పార్టనర్ / భర్త (అని పిలుస్తున్న వ్యక్తి) ఒడిశా నుంచి యువతులను తమ కుక్కల్ని చూసుకోవడానికి తీసుకొచ్చాడట. అయితే వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా పనులు చేయించి, చివర్లో ఇంటి నుంచి గెంటేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

“మీ బ్రతుకు నా చెప్పుల విలువ కూడా చెయ్యదు… మాకు లాయర్లు ఉన్నారు… మీరు ఏమీ చేయలేరు” అంటూ దూషించారని బాధితులు చెబుతున్నారు. ఈ విషయాన్ని వారిని ఇక్కడికి తీసుకొచ్చిన ఓ మహిళ వీడియోలో బయటపెట్టడంతో నెట్టింట్లో పెద్ద హల్‌చల్ అవుతోంది.

ఇదిలా ఉంటే… వీడియోలో ఆ వ్యక్తిని ఆ మహిళ “డింపుల్ హయాతి భర్త” అని పలుమార్లు సంబోధించడమే షాకింగ్ పాయింట్. ఇప్పటివరకు డింపుల్ పెళ్లి చేసుకుందన్న విషయం ఎవరికీ తెలియకపోవడంతో టాలీవుడ్‌లో కొత్త మిస్టరీ మొదలైంది.

ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఇదే – డింపుల్ హయాతి నిజంగానే పెళ్లి చేసుకుందా?

ఈ విషయంపై డింపుల్ హయాతి ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆమె శర్వానంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో బిజీగా ఉన్నట్టు సమాచారం.

, , , ,
You may also like
Latest Posts from