ఒక సినిమాను క్లాసిక్‌గా నిలిపే పాటలు అరుదుగా వస్తాయి. కానీ వాటిలో కొన్ని తరాలు మారినా మాయాజాలంలా ఆకట్టుకుంటుంటాయి. అలాంటి ఒక అద్భుత సంగీత కృతి ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’.
ఈ పాట ఒక పాట మాత్రమే కాదు — అది శబ్దాల లలిత కళ.
విజువల్‌గా అపురూపం, మ్యూజికల్‌గా నవీనతకు నిదర్శనం, కొరియోగ్రఫీగా కవిత్వం.
ఇళయరాజా మ్యాజిక్, బాలసుబ్రమణ్యం గాత్రం, వేటూరి పదచిత్రం — ఈ మూడు కలిసి చిరంజీవి-శ్రీదేవి జోడీని జ్ఞాపకాలలో పదిలం చేశాయి.
ఇప్పుడది మళ్లీ తెరపైకి రానుంది. జగదేకవీరుడు అతిలోకసుందరి విడుదలై 35 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మే 9న ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ ఐకానిక్ సాంగ్ వెనుక ఉన్న మధురస్మృతిని అభిమానులతో పంచుకున్నారు.
https://x.com/VyjayanthiFilms/status/1918327014576275733
ఈ సందర్భంగా ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ పాట గురించి చిరంజీవి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ రోజుకు కూడా ఎంతో ఆకర్షణీయంగా అనిపించే పాట ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’ అని ఆయన అన్నారు. ఈ పాట ఒక్క రోజులో రికార్డింగ్ అయిందంటే చాలామంది ఆశ్చర్యపోతారని పేర్కొన్నారు.
చిరంజీవి మాట్లాడుతూ…. ఒక్క రోజు కూడా కాదు, ఉదయం 9 గంటలకు ఇళయరాజా గారు రికార్డింగ్ హాలు వద్ద కూర్చుని 11-12 గంటల మధ్య తాము పక్క సెట్‌లో షూట్ చేస్తుండగా, ఆ పాట బాగుందా వినండి అని ఒక ట్యూన్ (మొత్తం పాట కాదు) పంపించారని, వినగానే రాఘవేంద్రరావు గారికి, దత్తు గారికి, తనకు చాలా బాగా నచ్చిందని తెలిపారు.
“పాట చాలా బాగుంది.. సింపుల్‌గా ఉంది.. మంచి రిథమ్‌తో ఉంది. రిథమ్ కూడా చాలా కొత్తగా ఉందనిపించింది” అని ఆయన అన్నారు. వేటూరి గారితో కూర్చుని లంచ్ టైమ్‌లో ‘అమ్మనీ కమ్మనీ దెబ్బ’ అంటూ ఎంతో తియ్యగా ఉందో యబ్బా అంటూ ఆయన రాసిన పాటను ఆ తర్వాత బాలు గారు పాడటం జరిగిందని చిరంజీవి వెల్లడించారు.