నాని హీరోగా తెరకెక్కిన “హిట్ 3” బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఓపెనింగ్ డే నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని, నాని గత చిత్రమైన “దసరా” ఓపెనింగ్‌ను దాటి తన బెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది. వీకెండ్‌లో కూడా వసూళ్లు అదే స్థాయిలో దూసుకుపోతుండటంతో… ఈ సినిమా బిగ్ బ్లాక్‌బస్టర్ అనే దిశగా స్పష్టమైన సంకేతాలిస్తోంది.

ఏరియా వైజ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి:

నిజాం: ₹13 కోట్లు (GST తో పాటు)

సీడెడ్: ₹3.5 కోట్లు

కోస్తా ఆంధ్ర: ₹12 కోట్లు (GSTతో సహా)

రెస్ట్ ఆఫ్ ఇండియా: ₹5.5 కోట్లు

ఓవర్సీస్: ₹11 కోట్లు

👉 మొత్తం థియేట్రికల్ షేర్: ₹45 కోట్లు
👉 జీఎస్టీ తీసేసిన తర్వాత షేర్: ₹41 కోట్లు

బిజినెస్ పరంగా?

ఈ సినిమాకు థియేట్రికల్ రైట్స్ విలువ ₹47 కోట్లు. ఇప్పటికీ ఈ సినిమా 87% రికవరీ సాధించడంతో, బయ్యర్లకు కంఫర్ట్ జోన్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా మారుతోంది. ఈ రేటుతోనే పయనిస్తే, ఇది నాని కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్ అవ్వడం ఖాయం.

, , ,
You may also like
Latest Posts from