పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామా ‘OG’ (ఓజస్ గంభీర). యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఓజీ ఇవాళ (సెప్టెంబర్ 25న) థియేటర్లలో విడుదలైంది. ఓజాస్‌‌‌‌ గంభీర అనే పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో పవన్ కళ్యాణ్‌‌‌‌ నటించాడు. ఒమీ అనే విలన్‌‌‌‌ క్యారెక్టర్లో ఇమ్రాన్ హష్మీ కనిపించాడు. పవన్ భార్యగా కన్మణి పాత్రలో ప్రియాంక, సత్య దాదాగా ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

పవన్ కళ్యాణ్ OG కి ఉన్న హైప్ ట్రేడ్ సర్కిల్స్‌ లోనూ, ఫ్యాన్స్‌ మధ్యనూ ఎలక్ట్రిఫై చేస్తోంది. గ్లోబల్ బాక్సాఫీస్ ప్రీ-సేల్స్‌లో పెద్ద బిజినెస్ జరుగగా, కేవలం హైదరాబాదు ప్రీమియర్స్‌తోనే 1.3 కోట్లు వసూలైంది!

హైదరాబాదు లో స్పెషల్ షోలు థర్డ్ పార్టీలకు భారీ రేట్లతో అమ్మడం కొత్తేమీ కాదు. కానీ OG అయితే పవన్ కెరీర్‌లోనే అత్యంత హైప్డ్ ఫిల్మ్ కాబట్టి డిమాండ్ ఆకాశాన్నంటింది.

తాజా బజ్ ఏంటంటే – 7 సింగిల్ స్క్రీన్ థియేటర్ల ప్రీమియర్ రైట్స్‌ను 1.3 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశారు. ఇందులో X రోడ్స్ (4 థియేటర్స్), మూసాపేట్, విశ్వనాథ్, అర్జున్ థియేటర్స్ ఉన్నాయి.

టికెట్లు ఆఫ్‌లైన్‌లోనే ₹2000–₹2500కి అమ్ముతున్నారు. అంత డిమాండ్ ఉండటంతో ఫ్యాన్స్, మూవీ లవర్స్ రేసులో దూసుకెళ్తున్నారు.

సుమారు రూ.250 కోట్లతో డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. నేషనల్ అవార్డు విన్నర్ నవీన్‌ నూలి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించారు. మోస్ట్ క్రియేటెడ్ టెక్నీషియన్స్ రవి కె.చంద్రన్‌, మనోజ్‌ పరమహంస సినిమాటోగ్రఫర్స్గా పనిచేశారు.

, , , , ,
You may also like
Latest Posts from