ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఉన్నట్లే, నేను ఇన్‌క్రెడిబుల్ ఇళయరాజాను. నాలాంటి వారు ఎప్పుడూ లేరు, మరొకరు ఉండరు అన్నారు ఇళయరాజా. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja)మార్చి 8న లండన్‌లో భారీస్థాయిలో ఆర్కెస్ట్రా ప్రదర్శన నిర్వహించనున్న వేళ ఈ కామెంట్స్ చేసారు.
ఇళయరాజా మాట్లాడుతూ…“ఈ కచేరీ అభిమానులకు గొప్ప సంగీత విందుగా ఉంటుంది. అభిమానుల్లాగే నేనూ ఉత్సాహంగా ఉన్నాను. మీరంతా లేకుంటే నేనేమీ లేను అన్నాడు. ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఉన్నట్లే, నేనే ఇన్‌క్రెడిబుల్ ఇళయరాజాను’’ అని ప్రకటించారు. “నాలాంటి వారు ఎప్పుడూ లేరు, మరొకరు ఉండరు. నేను నా పనిపై దృష్టి సారిస్తాను, మీ కోసం మీరు కూడా అలాగే చేయాలి.
ఇక రీసెంట్ గా ఇళయరాజా నివాసానికి తమిళనాడు సీఎం స్టాలిన్(MK Stalin) వెళ్లారు. ఆయన్ను స్వయంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఇళయరాజాను శాలువాతో సన్మానించి కాసేపు ముచ్చటించారు. సంబంధిత వీడియోను సీఎం స్టాలిన్ తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఇళయ రాజాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజల సంగీత శ్వాస అని సీఎం కొనియాడారు.
ఆసియాలోనే ఇంతకుముందు ఎవరూ చేపట్టని రీతిలో సింఫనీ కార్యక్రమం ఏర్పాటుకు ధైర్యంగా ముందుకొచ్చిన ఇళయరాజాను అభినందించారు. ఈ సందర్భంగా తన చేతితో రాసిన మ్యూజిక్ నోట్స్‌ని ఇళయరాజా సీఎంకు చూపించారు.
ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా తన ఇంటికి వచ్చి పలకరించడంపై ఇళయరాజా సంతోషం వ్యక్తం చేశారు. అంతటి బిజీ షెడ్యూల్‌లోనూ కొంత సమయం వెచ్చించి తనను కలవడం.. సంగీతం పట్ల ఆయనకు ఉన్న మక్కువ, అభిమానం తనను ఆనందపరిచాయన్నారు.
సీఎం పోస్టును రీట్వీట్ చేస్తూ ఆయనకు ఇళయరాజా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.