సందీప్ రెడ్డి వంగా అంటే కథల్లో హీరోని సమాజం భయపడే వ్యక్తిగా చూపించడమే ఆయన స్టైల్. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ తర్వాత… ఇప్పుడు ఆ లైన్లోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి కొత్త యాంగిల్ ఇవ్వబోతున్నాడు.

ప్రభాస్ బర్త్‌డే పూట …వంగా అందరినీ షాక్‌లోకి నెట్టేశాడు — ‘స్పిరిట్ – సౌండ్ స్టోరీ’ పేరుతో రిలీజ్ చేసిన ఓ ఆడియో టీజర్‌తో!

ఈ సౌండ్ టీజర్‌లో దర్శనమయ్యేది ఎవరూ కాదు, కానీ వాయిస్‌లే సినిమా హీట్ పెంచేశాయి ప్రకాశ్ రాజ్‌ వాయిస్‌లో ఒక జైలు సూపరింటెండెంట్, అతని సబ్‌ఆర్డినేట్‌తో మాట్లాడుతాడు –

‘ఇది నీ పరేడ్ గ్రౌండ్ కాదు… వాక్ ఫాస్ట్’ అంటూ జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ రాజ్ ఆర్డర్స్ పాస్ చేయగా… పక్కనే ఉన్న ఆయన అసిస్టెంట్… ‘ఐపీఎస్ ఆఫీసర్ సార్… అకాడమీ టాపర్ సార్’ అంటూ ఆ వచ్చిన వ్యక్తి గురించి చెబుతాడు. ‘ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండవ్. ఓన్లీ నెంబర్స్. వీడికి ఆ బ్లాక్ స్ట్రైట్ ఇచ్చి డీటెయిల్స్ రాసి లెఫ్ట్ రైట్ సెంటర్ ఫోటోస్ తీయండి.’ అంటూ ఆ ఎస్పీ చెప్పడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

‘వీడి గురించి విన్నాను. యూనిఫాం ఉన్నా లేకపోయినా బిహేవియర్‌లో తేడా ఉండదని. కాండక్ట్ ఇష్యూస్ వల్ల ఓసారి టెర్మినేట్ అయ్యాడని. చూద్దాం ఈ ఖైదీ యూనిఫాంలో ఎలా బిహేవ్ చేస్తాడో.’ అంటూ ప్రభాస్ రోల్ ఇంట్రడ్యూస్ చేయడం హైప్ ఇచ్చింది.

“అతను IPS టాపర్ అయినా, టెర్మినేట్ చేశారు. జైలులో కూడా అతన్ని స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వొద్దు…”

అతను చెప్పిన ఆ “అతను” ఎవరో తెలుసా? — ప్రభాస్. రెబెల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు ప్రభాస్.

ఆడియో చివర్లో ప్రభాస్ వాయిస్‌లో ఒక్క మాట వింటాం —

“నాకు చిన్నప్పటి నుండి ఒక చెడు అలవాటు ఉంది…”
అంటే ఏమిటి ఆ అలవాటు? అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా క్యూరియాసిటీకి కారణమైంది

సండీప్ రెడ్డి వంగా ఇంకా షూట్ మొదలుపెట్టకముందే, ఒక వాయిస్ టీజర్‌తోనే ఫ్యాన్స్‌ని రగిలించాడు. డైలాగ్ ఇంటెన్సిటీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, లీడ్ క్యారెక్టర్ డెఫినిషన్ – అన్నీ కలిపి సినిమా మీద హైప్‌ను సీలింగ్‌కి తీసుకెళ్లాయి!

ఈ మూవీలో ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గుల్షన్ కుమార్, టి సిరీస్ సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు.

, , , , , ,
You may also like
Latest Posts from