కాంతార ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మైథాలజికల్ డ్రామాకు ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ పాన్ ఇండియా వైడ్‌గా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఈ గ్రాండ్ రిలీజ్‌కు ముందు హైదరాబాద్‌లో తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ జరగగా, స్పెషల్ గెస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు.

ఇటీవల యాడ్ షూట్‌లో గాయపడి, డాక్టర్లు రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, రిషబ్‌ కోసం గాయంతోనే స్టేజ్ ఎక్కిన ఎన్టీఆర్‌ నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఎన్టీఆర్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ – “కొంచెం నొప్పిగా ఉంది… గట్టిగా మాట్లాడలేను. మీరు సైలెంట్‌గా ఉంటే, చెప్పాల్సింది చెబుతాను. మా అమ్మమ్మ నన్ను చిన్నప్పట్లో కూర్చోపెట్టి చాలా కథలు చెప్పేది. గుళిగా ఆట, పింజర్లి లాంటి వాటిని నేను అప్పట్లో చూడాలని అనుకునేవాడిని. కానీ వాటి మీద ఒక డైరెక్టర్ సినిమా తీయడం నేను ఊహించలేదు. నా బ్రదర్ రిషబ్‌ షెట్టి తీసాడు” అని అన్నారు.

“నా చిన్ననాటి జ్ఞాపకాలను స్క్రీన్ మీద చూడటం నాకు షాక్ ఇచ్చింది. రిషబ్‌ అనేది ఒక రేర్ బ్రీడ్ డైరెక్టర్‌, యాక్టర్‌. మా అమ్మ ఎప్పటి నుంచో ఉడుపి కృష్ణుడిని దర్శించుకోవాలని కోరుకుంది. ఆ కోరిక నెరవేర్చింది రిషబ్‌నే. మా కోసం ఆలయానికి తీసుకెళ్లి, ఆశీర్వాదం ఇప్పించి సొంత తమ్ముడిలా చూసుకున్నాడు. దీనికి నేను జీవితాంతం కృతజ్ఞుడ్ని” అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు.

చివరిగా – “కాంతార చాప్టర్ 1 తీయడం ఈజీ కాదు. కానీ రిషబ్ గ్యారెంటీగా మళ్లీ హిస్టరీ రిపీట్ చేస్తాడు. నా బ్రదర్ పడ్డ కష్టానికి ఫలితం ఇవ్వాలి. ఇంకా మాట్లాడదలచుకున్నా, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను” అని చెప్పి ముగించాడు.

NTR గాయాల మధ్య కూడా రిషబ్‌ కోసం స్టేజ్ ఎక్కి చేసిన ఈ ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

, , , , ,
You may also like
Latest Posts from