హాలీవుడ్ స్టార్ డైరక్టర్ క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకి ఒక ప్రత్యేక క్రేజ్. ఇండియాలో కూడా ఆయన సినిమాలు రికార్డ్ లు బ్రద్దలు కొట్టాయి. ఆయన చేసిన మొదటి చిత్రం నుంచి ఇప్పుడు ప్రతీ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ కి ఒక క్రేజీ ఎక్స్ పీరియన్స్ ని అందిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాను డైరక్ట్ చేసిన పలు క్లాసిక్ చిత్రాల్లో ఎమోషనల్ సై ఫై థ్రిల్లర్ చిత్రం “ఇంటర్ స్టెల్లార్” కూడా ఒకటి. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు రీరిలీజ్ కు వచ్చింది.

“ఇంటర్ స్టెల్లార్” చిత్రం లేటెస్ట్ గా ఐమ్యాక్స్ రీ రిలీజ్ కి మళ్లీ వచ్చింది. మరి ఇలా వచ్చిన సినిమా వరల్డ్ వైడ్ ఐమ్యాక్స్ రీ రిలీజ్ లలో ఆల్ టైం హైయెస్ట్ వసూళ్లు అందుకున్నట్టుగా హాలీవుడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

మరి ఈ డిసెంబర్ 6న మన దేశంలో తప్ప బయట అంతా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఇపుడు ఐమ్యాక్స్ లో హైయెస్ట్ గ్రాస్ ని అందుకుని టాప్ లో నిలిచింది. ఇక ఈ సినిమా ఇండియాలో ఇండియాలో ఈ నెల 14న థియేటర్స్ లో పాటు ఐమాక్స్ లోనూ ఇంటర్ స్టెల్లార్ విడుదల కాబోతోంది.మార్చి 14 నుంచి మార్చి 20, 2025 వరకే ఈ సినిమా ప్రదర్శించబడుతుంది. ప్రసాద్ ఐమాక్స్ లో ఈ షోలు ఉంటాయి. ఇప్పటికే నాలుగు వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

అయితే కేవలం 7 రోజులు మాత్రమే ప్రదర్శిస్తారట. లిమిటెడ్ రన్ అన్నమాట. కాకపోతే దీనికి సంబంధించిన ప్రచారం పెద్దగా కనిపించడం లేదు. ఇక్కడ కూడా రికార్డ్ లు బ్రద్దలు కొట్టేలా కనపడుతోంది.

, , ,
You may also like
Latest Posts from