పుష్ప 2 చిత్రంతో సూపర్ సక్సెస్ కొట్టిన దర్శకుడు సుకుమార్ త్వరలో పుత్రికోత్సాహాన్ని అనుభవించబోతున్నారు. ఆయన కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి తెరంగేట్రం చేస్తున్న గాంధీ తాత చెట్టు ఫిబ్రవరి 24 థియేటర్లలో విడుదల కానుంది. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. సుకుమార్ భార్య తబిత ఈ చిత్రానికి సమర్పకురాలు. ట్రైలర్ ఈరోజు మహేష్‌బాబు చేతుల మీదుగా విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. చిత్రం విడుదల నేపద్యంలో నిర్మాత రవిశంకర్ అన్నమాటలు ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి.
‘గాంధీ తాత చెట్టు’ చిత్రం పంపిణి బాధ్యతలు చూసుకుంటున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్వహించిన ఈవెంట్ లో నిర్మాత రవిశంకర్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. అది కూడా పుష్ప 2కి ముడిపడింది కావడంతో అంతటా హాట్ టాపిక్ గా మారింది.
అల్లు అర్జున్ నటించగా తమ నిర్మాణంలో వచ్చిన పుష్ప 95 శాతం ఆడియన్స్ కి బాగా నచ్చిందని అయితే క్యారెక్టరైజేషన్ గురించి కొంత నెగటివ్ గా ఫీలైన వాళ్ళు ఒక 5 శాతం ఉంటారని వాళ్లకు కూడా నచ్చేలా ‘గాంధీ తాత చెట్టు’ అద్భుతంగా ఉంటుందని, అందరూ ఆదరించాలని కోరారు.
ఇక ‘గాంధీ తాత చెట్టు’ తో ఉత్తమ పరిచయ బాలనటిగా (బెస్ట్ డెబ్యూ చైల్డ్ యాక్టర్) సుకృతి.. ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ (dadasaheb phalke film festival award) పురస్కారం అందుకుంది. ‘దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్,’ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ అవార్డులూ సుకృతికి వరించాయి.
11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా, న్యూదిల్లీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ బెస్ట్ ఫిల్మ్‌గా, జైపుర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, 8వ ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జ్యూరీ బెస్ట్ ఫిల్మ్‌గా ‘గాంధీ తాత చెట్టు’ నిలిచింది.