యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు ఉస్తాద్ రామ్ పోతినేని. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్న అతడు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు ఫాలోయింగ్, మార్కెట్‌ను కూడా బాగా పెంచుకున్నాడు. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న రామ్.. వరుస సినిమాలతో దూసుకుపోతోన్నాడు. ఈ నేపథ్యంలో హీరో రామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దానికి సంబంధించిన వివరాలేంటో మీరే చూడండి!

తాజాగా రామ్ ప్రేమలో లో పడినట్లు సమాచారం. రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్గా నటించిన భాగ్యశ్రీ బోర్సేతో రామ్ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం.రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా డిజాస్టర్ గా నిలిచినా.. ఈ సినిమాలో అమ్మడి నటనకు అందానికి అభిమానులు ఫిదా అయ్యారు.

ప్రస్తుతం రామ్ పోతినేని నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ అవకాశాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతూ ఉండగా అక్కడే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ కథ ..పెళ్లి దాకా చేరుతుందా లేదా అన్నది చూడాలి అంటున్నారు.

ఇదిలా ఉంటే అలాంటిదేమీ లేదు చాలా కాలంగా ఈ స్టార్ హీరో తన చిన్ననాటి స్నేహితురాలితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడట. ఇప్పుడు ఆమెనే అతడు వివాహం చేసుకోబోతున్నాడని తెలిసింది. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఏది నిజమో తెలియాల్సి ఉంది.

You may also like
Latest Posts from