తన సినిమాపై పూర్తి కమాండ్‌… ప్రతి డీటెయిల్‌ పట్ల స్పష్టమైన విజన్ – చిరంజీవి వర్క్‌ స్టైల్‌ ఇలానే ఉంటుంది. కథనంపై పట్టు, ఫైట్స్‌లో ఫినిషింగ్, విజువల్ ఎఫెక్ట్స్‌లో వెర్సటిలిటీ – అన్నింటినీ దగ్గర నుంచే పర్యవేక్షిస్తూ, ఫైనల్ ఔట్‌పుట్‌ తన మెరుగు ముద్రతో రావాల్సిందేనన్నది మెగాస్టార్‌ అభిప్రాయం.

ఈ కోణంలోనే ‘విశ్వంభర’ కోసం సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కంపోజ్‌ చేసిన ఐటెం సాంగ్‌ ట్యూన్‌ చిరంజీవికి పెద్దగా నచ్చలేదన్న టాక్‌ ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. ట్యూన్‌ విన్న వెంటనే ఆయన క్లియర్‌గా ‘చేంజ్ చేయండి’ అన్నట్టు సమాచారం. ఈ నిర్ణయం బట్టి ఆయన సినిమాపై ఎంత స్థాయిలో శ్రద్ధ తీసుకుంటారో అర్థం అవుతుంది.

ప్రస్తుతం కీరవాణి కొత్త ట్యూన్‌ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ట్యూన్‌ ఫిక్స్ అయిన వెంటనే షూటింగ్‌కు శ్రీకారం చుడతారు. అంతవరకూ పాట మిగిలిన పనులు నిలిపివేశారు. అలాగే ఈ సాంగ్‌కి హీరోయిన్ ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకురానుంది.

మెగాస్టార్ ఇమేజ్‌కు తగిన రీతిలో గ్రాండియస్ స్కేల్‌లో రూపొందుతున్న ఈ చిత్రం, విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద భారీ హైప్ క్రియేట్ చేసే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

, , ,
You may also like
Latest Posts from