
జాన్వీ నారంగ్ డెబ్యూ షాక్! పెద్ద ప్రొడక్షన్ ..చిన్న సినిమా..డిజాస్టర్ ఫలితం
జాన్వీ నారంగ్ ప్రముఖ సినిమా నిర్మాత, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP మేనేజింగ్ పార్ట్నర్, దివంగత నిర్మాత నారాయణ్ దాస్ కె. నారంగ్ మనవరాలు, నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె. ఆమె ‘కుబేర’ వంటి చిత్రాల కోసం చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆ అనుభవంతో తొలిసారిగా నిర్మాతగా మారారు.
నారంగ్ ఫ్యామిలీకి చెందిన థియేటర్ చైన్స్ (AMB, Asian Cinemas) వెనుక ఉన్న యంగ్ ప్రొడ్యూసర్ జాన్వీ నారంగ్ మొదటిసారిగా సొంతంగా నిర్మించిన సినిమా… ప్రేమంటే. కానీ ఆశ్చర్యకరంగా ఈ డెబ్యూ ప్రొడక్షన్ భారీ ఫ్లాప్‌గా మారింది. పబ్లిక్ టాక్, రివ్యూలు—రెండు కూడా దారుణంగా నెగటివ్.
ప్రియదర్శి గతంలో కొన్ని సోలో హిట్స్ ఇచ్చినా… ఈసారి మాత్రం ఫస్ట్ డే ఓపెనింగ్స్ కూడా సరైన స్థాయిలో లేవు. ఇదే సమయంలో కొత్తవాళ్లు చేసిన చిన్న సినిమా ‘Raju Weds Rambabi’ మాత్రం బలంగా ఓపెన్ అయి వీకెండ్ రిలీజ్లన్నింటినీ డామినేట్ చేసింది.
భారీ బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమా చేసినా హిట్ గ్యారంటీ అన్న మాటే లేదనడానికి ఇదే ప్రూఫ్.
ప్రేమంటే ఫ్లాప్‌తో ప్రియదర్శికి మరో పెద్ద సెట్‌బ్యాక్. అలాగే టాలెంటెడ్ అనంది కూడా తెలుగులో ఇలాంటి స్క్రిప్టులని సెలెక్ట్ చేస్తూనే ఉండటం ఇప్పుడు డిస్కషన్ అవుతోంది.
డబ్బు, బ్యాక్‌గ్రౌండ్, క్రేజ్… అన్నీ ఉన్నా కంటెంట్ లేకపోతే ఫలితం ఇదే!
