జూ.ఎన్టీఆర్ తాజాగా తన ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ ఎనౌన్సమెంట్ చేశారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తనను కలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. ఆ విషయం తాను అర్థం చేసుకోగలనని ఆయన తెలిపారు.

అలాగే త్వరలోనే అభిమానుల కోసం ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానని.. అభిమానులందరినీ తాను ప్రత్యేకంగా కలుసుకుంటానని తారక్ తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తారక్ తెలిపారు.

ఇలాంటి పెద్ద సమావేశం ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతుందని.. కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని తారక్ కోరుతున్నట్లు ఆయన ఆఫీస్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.

ఈ నేపథ్యంలో, అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని.. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రాధాన్యత అని తారక్ స్పష్టం చేశారు.

ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ స్పెషల్ ప్లాన్ చేస్తుండటంతో ఆయన్ను కలిసేందుకు వాళ్లంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

,
You may also like
Latest Posts from