‘కాంతారా’తో దేశం మొత్తం ఊగిపోయింది. సాంప్రదాయానికి, మిస్టిసిజానికి, మాస్ ఎమోషన్‌కి మిశ్రమంగా నిలిచిన ఆ చిత్రం రికార్డులు చెరిపేసింది. నేషనల్ అవార్డ్‌ కూడా అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘కాంతారా చాప్టర్ 1’ తో రిషబ్ శెట్టి మరింత ఎత్తుకు ఎగబాకాడు — హీరోగానే కాదు, దర్శకుడిగా కూడా నేషన్‌వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు ఆ రిషబ్ గురించే ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది — అతని అసలు పేరు రిషబ్ కాదు అంట!

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి ఇలా చెప్పాడు:

“నా అసలు పేరు ప్రశాంత్. కానీ నా నాన్నగారికి జ్యోతిష్యంలో మంచి పట్టు ఉంది. కెరీర్ పరంగా బాగుండాలంటే పేరు మార్చమని ఆయన చెప్పారు. అలా నేను ప్రశాంత్‌ నుంచి రిషబ్ అయ్యాను. అదే నా లైఫ్ మార్చింది.”

ఇప్పుడు ఆ ‘రిషబ్’ పేరు నిజంగానే అతనికి బంగారు అదృష్టం తీసుకొచ్చిందనటంలో ఎటూ సందేహం లేదు.

ఇక త్వరలోనే రిషబ్ తెలుగులో కూడా అడుగు పెడుతున్నాడు — ‘జై హనుమాన్’ సినిమాతో!
‘కాంతారా’ ఎంత సెన్సేషన్ సృష్టించిందో, ‘చాప్టర్ 1’ ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయ్యిందో చూస్తే… ‘జై హనుమాన్’తో రిషబ్ మరోసారి పాన్-ఇండియా మ్యాజిక్ చేయబోతున్నాడని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

, , , ,
You may also like
Latest Posts from