తమిళ హీరో కార్తి గాయపడ్డాడు. ప్రస్తుతం మైసూరులో జరుగుతున్న షూటింగ్ సందర్భంగా గాయపడ్డాడు. గత కొన్నిరోజుల నుంచి కర్ణాటకలోని మైసూరులో కార్తి కొత్త సినిమా ‘సర్దార్ 2’ షూటింగ్ జరుగుతోంది. కీలకమైన సీన్స్ తీస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే కార్తి కాలికి గాయమైంది. దీంతో టీమ్ దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అయితే అంత పెద్ద ప్రమాదం ఏమి లేదని, ఎలాంటి ఇబ్బంది లేదని, కాకపోతే వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని కార్తికి డాక్టర్స్ సూచించారు. దీంతో షూటింగ్ అంతా ఆపేసి చెన్నై వెళ్లిపోయారు.

2022లో వచ్చిన ‘సర్దార్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఇందులో కార్తి, రజిషా విజయన్ తో పాటు ఎస్జే సూర్య, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ నటిస్తున్నారు.

సర్దార్ 2 పూర్తి చేసిన తర్వాత కార్తి.. ఖైదీ 2 షూటింగ్ మొదలు పెడతాడు. అంతలో దర్శకుడు లోకేశ్ కనగరాజ్.. రజినీకాంత్ తో ‘కూలీ’ పూర్తి చేసి వస్తాడు.

LCUలో భాగమైన ‘ఖైదీ 2’ ఎక్సపెక్టేషన్స్ మాత్రం గట్టిగానే ఉన్నా.

, , ,
You may also like
Latest Posts from