సర్ప్రైజ్ లు ముందే సోషల్ మీడియాలో లీక్ అవటం ఈ మధ్యకాలంలో బాగా జరుగుతోంది. ఇది దర్శక,నిర్మాతలను చాలా బాధిస్తోంది. రీసెంట్ గా నాని హిట్ 3 సినిమాలో కార్తీ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై దర్శకుడు ఫీల్ అయ్యి ట్వీట్ చేసారు.

వివరాల్లోకి వెళితే..ఈ మేలో ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’తో థియేటర్లలో సందడి చేయనున్నారు హీరో నాని. విజయవంతమైన ‘హిట్‌’ ఫ్రాంచైజీలో భాగంగా శైలేశ్‌ కొలను తెరకెక్కించిన చిత్రమిది. వాల్‌ పోస్టర్‌ సినిమా, యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు.
శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్.

దీంట్లో అడివి శేష్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. కాగా, ఇప్పుడీ చిత్రంలో మరో గెస్ట్ రోల్ కోసం తమిళ హీరో కార్తిని (Karthi) రంగంలోకి దించినట్లు సమాచారం. ఇటీవలే ఆయన షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ‘హిట్‌ 4’ను (Hit 4) కార్తితో కొనసాగించే అవకాశమున్నట్లు నెట్టింట చర్చ మొదలైంది.

ఎందుకంటే ఈ ఫ్రాంచైజీలో వచ్చిన గత చిత్రాల్లో తదుపరి భాగం చేయబోయే హీరోని క్లైమాక్స్‌లో అతిథిగానే పరిచయం చేశారు దర్శకుడు. ఈ నేపథ్యంలో కార్తి అతిథి పాత్రలో కనువిందు చేయనున్నారనగానే అది ‘హిట్‌ 4’ కోసమేనన్న ప్రచారం ఊపందుకుంది.

ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: సాను జాన్‌ వర్గీస్‌.

, , , ,
You may also like
Latest Posts from