సినిమా గాసిప్స్సినిమా వార్తలు

ప్రభాస్ ‘స్పిరిట్’లో డాన్ లీ కన్ఫర్మ్ అయ్యాడా? – కొరియన్ మీడియా పెద్ద రివీల్!

ప్రభాస్ హీరోగా, సండీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా ఇంకా సెట్స్‌పైకి రాకముందే వరల్డ్ వైడ్‌గా హల్‌చల్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎన్నో రూమర్స్ వినిపించాయి. వాటిలో ఒకటి — కొరియన్ స్టార్ మా డోంగ్ సియోక్ (Don Lee) ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడని.ఇప్పుడు ఆ వార్తకు మరో పెద్ద బలమొచ్చింది.

కొరియన్ మీడియా కన్‌ఫర్మ్ చేసింది – డాన్ లీ ఇండియన్ సినిమా డెబ్యూ ‘స్పిరిట్’తోనే!

కొరియా లోని ప్రముఖ మీడియా హౌస్ ‘ముకో’ (Muko) రిపోర్ట్ ప్రకారం, డాన్ లీ (Train to Busan, The Roundup ఫేమ్) ఇప్పుడే తన మొదటి ఇండియన్ సినిమా డెబ్యూ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అదీ ప్రభాస్‌తో కలిసి ‘స్పిరిట్’ లోనే!

వారి రిపోర్ట్‌లో స్పష్టంగా ఇలా ఉంది

“సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న Spirit సినిమాలో ప్రభాస్‌తో పాటు డాన్ లీ కీలక నెగటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇదే ఆయన ఇండియన్ సినిమా తొలి ప్రాజెక్ట్.”

ప్రభాస్ vs డాన్ లీ – ఇంటర్నేషనల్ కాంబోపై ఫ్యాన్స్ క్రేజ్!

ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో హీట్ పెరిగింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హైప్‌లో ఉన్నారు . సినిమా మీద ముందే ఉన్న క్రేజ్ ఇప్పుడు డైరెక్ట్‌గా గ్లోబల్ బజ్ గా మారింది.

ఇక ‘స్పిరిట్’ ఒక డార్క్ యాక్షన్ క్రైమ్ డ్రామా గా రూపొందుతోంది. ప్రభాస్ ఒక రిబెల్ కోప్‌గా, డాన్ లీ అయితే అతనికి ఎదురుగా వచ్చే పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్నాడు. ఈ కాంబినేషన్ కేవలం టాలీవుడ్‌కే కాదు, ఏషియన్ సినీ మార్కెట్‌కి కూడా హైలైట్ అవ్వబోతోందని టాక్.

Similar Posts