నిత్యా మీనన్ ప్రేమపై తన అభిప్రాయాలు ఎలా మారిపోయాయో ఓపెన్‌గా పంచుకుంది. తన ప్రతి ప్రేమ ప్రయాణం చివరికి హృదయవేదనతోనే ముగిసిందని ఆమె నిజాయితీగా చెప్పింది.

“ప్రతి సంబంధం ఒక బ్రేకప్‌తోనే ముగిసింది. నేను నమ్మిన వారు, నిజంగా వారు కావడం లేదని మళ్లీ మళ్లీ తెలిసింది,” అని చెప్పిన నిత్యా, “నేను ఆశించిన ఆ గాఢమైన అనుబంధం… ఒక కలలో భాగం మాత్రమే అయి ఉండొచ్చని చివరికి అర్థమైంది,” అని ఆమె చెప్పారు.

ఇప్పటికే ప్రేమపై ఉన్న అభిప్రాయాలను మార్చుకున్న నిత్యా, ఇప్పుడు రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ కోసం వెతకడం మానేసిందని, సింగిల్‌గా ఉండటమే తనకు తగిన మార్గమని అంటోంది.

“ఒంటరిగా ఉండడమంటే నాకు ఎప్పుడూ భయం లేదు. నిజానికి నేను నన్ను నేను బాగా ఆస్వాదించగలుగుతాను,” అని స్పష్టంగా చెప్పిన నిత్యా… ఇప్పుడు జీవితాన్ని కొత్త స్పష్టతతో చూస్తోంది. ప్రేమ లేకుండా కూడా జీవితం పూర్ణంగా ఉండొచ్చని ఆమె నమ్ముతోంది.

You may also like
Latest Posts from