
కేరళలో లగ్జరీ కార్ల మాఫియాపై కస్టమ్స్ పెద్ద ఎత్తున దాడులు చేసి సంచలనం సృష్టించింది. భూటాన్ నుంచి కోటి రూపాయిలకు పైగా విలువైన కార్లు అక్రమంగా ఇండియాలోకి వస్తున్నాయన్న ఇంటెలిజెన్స్ ఆధారాలపై, కొచ్చి కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్) “ఆపరేషన్ నమ్‌ఖోర్” పేరిట సెర్చ్‌లు చేపట్టింది.
ఒక్కసారిగా కేరళ అంతా 30 ప్రదేశాల్లో రెయిడ్లు జరగడంతో సినీ, వ్యాపార వర్గాల్లో హడావుడి. ఇందులో భాగంగా మలయాళ స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపైనా కస్టమ్స్ అధికారులు మంగళవారం సోదాలు చేశారు.
అయితే ఫలితం ఏంటంటే?
వారి వద్ద అక్రమ వాహనాలు ఏవీ లేవని కస్టమ్స్ గుర్తించింది. కానీ, ఈ స్మగ్లింగ్ రాకెట్‌లో స్టార్‌లు పేర్లు రావడంతో టాలీవుడ్-మలయాళ ఫిల్మ్ వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి.
లగ్జరీ వాహనాల సీక్రెట్ రూట్
భూటాన్‌లో ఆర్మీ నుంచి ఫారిన్ కార్లను వేలంలో 5–6 లక్షలకు కొంటారు. వాటిని ఇండియాలోకి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా హిమాచల్ ప్రదేశ్ మీదుగా స్మగ్లింగ్ చేస్తారు. తర్వాత కేరళ నంబర్ ప్లేట్‌తో రీమోడల్ చేసి 40 లక్షల దాకా అమ్మేస్తారు.
అసలు మార్కెట్ విలువ? కోట్ల రూపాయలు!
సెలబ్రిటీల పాత్ర ఏమిటి?
కస్టమ్స్ అనుమానం ఏమిటంటే, ఈ కార్లను కొనుగోలు చేసినవారిలో నటులు, పారిశ్రామికవేత్తలు, బిజినెస్ ఐకాన్లు కూడా ఉన్నారని.
అయితే, వీరికి ఈ వాహనాల స్మగ్లింగ్ గురించి తెలుసా లేదా తెలియకపోయినా కొనేశారా అన్నది విచారణలో తేలాలి.
“ఆపరేషన్ నమ్‌ఖోర్”లో ఏమి బయటపడుతుందో?
భూటాన్ ఆర్మీ వాహనాల వేలం నుంచి మొదలైన ఈ రహస్య స్మగ్లింగ్ నెట్‌వర్క్ వెనుక హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రాకెట్ ఉందని కస్టమ్స్ అనుమానిస్తోంది. వాహనాల రసీదులు, నకిలీ అడ్రస్ రిజిస్ట్రేషన్లు అన్నీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి.
