బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన మహావతార్ నరసింహ, ప్రస్తుతం ఇండియన్ సినిమా చరిత్రలో యానిమేషన్ చిత్రాలకు కొత్త గమ్యాన్ని చూపిస్తున్న హిట్ మూవీగా నిలిచింది. ప్రేక్షకుల ఏకగ్రీవ స్పందన, ఊహించని రీతిలో పెరిగిన కలెక్షన్లు – ఇవన్నీ కలసి ఈ చిత్రాన్ని “ట్రెండ్‌సెట్టర్” స్థాయికి చేర్చాయి.

ఊహించని బ్లాక్‌బస్టర్

భారతీయ యానిమేషన్ రంగం ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నప్పటికీ, మహావతార్ నరసింహ విజయం ఈ జానర్‌లో పెద్ద కలలు కనేవారికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. భక్తి, యానిమేషన్ మేళవింపుతో వచ్చిన ఈ చిత్రం ఈ తరహా సినిమాలకు కొత్త మార్గం చూపించింది.

దర్శకుడు అశ్విన్ కుమార్ దర్వకత్వంలో, క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే ₹200 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. 300 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తూ, ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ యానిమేషన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది.

పెద్ద సినిమాలు సైతం రెండు వారాలు థియేటర్లలో ఆడలేని పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో మహావతార నరసింహ మూడు వారాలుగా డీసెంట్ ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది. ఈ సినిమాకు వస్తున్న విశేష ఆదరణ చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రూ.150 కోట్ల వసూల్ చేసి.. రూ.200 కోట్ల మార్క్ వైపునకు దూసుకెళ్తుంది. మహావతార ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాను అధిగమించింది.

హొంబాలే ఫిల్మ్స్ ప్రెజెంటేషన్

కేజీఎఫ్, కాంతారా వంటి పాన్-ఇండియా హిట్స్ వెనుక ఉన్న హొంబాలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేసి, డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇది మొత్తం ఏడు భాగాలుగా రాబోయే మహావతార్ సినిమాటిక్ యూనివర్స్లో మొదటి చాప్టర్ మాత్రమే.

ప్రహ్లాద–హిరణ్యకశిపు గాధకు కొత్త రూపం

ప్రహ్లాద–హిరణ్యకశిపుల అద్భుతమైన గాధను కొత్త తరహాలో, అద్భుతమైన విజువల్స్‌తో చూపించడం ఈ సినిమా ప్రత్యేకత. ట్రేడ్ విశ్లేషకులు ఈ చిత్రాన్ని “ప్రతి వర్గం ప్రేక్షకుడూ ఎంజాయ్ చేసేలా తీర్చిదిద్దిన రేర్ యానిమేషన్ మూవీ” గా అభివర్ణిస్తున్నారు. కొందరు దీన్ని రీసెంట్ గా వచ్చిన హనుమాన్ పోల్చుతూ, “అప్పట్లో హనుమాన్ ఎలా గేమ్-చేంజర్ అయిందో, ఇప్పుడు మహావతార్ నరసింహ అదే స్థాయిలో ఉంది” అని అంటున్నారు.

సింపుల్‌గా చెప్పాలంటే — మహావతార్ నరసింహ యానిమేషన్ సినిమాలకు గోల్డెన్ ఎరా ప్రారంభించిన చిత్రంగా నిలిచిపోయింది.

, , ,
You may also like
Latest Posts from