మలయాళంలో వచ్చిన “మార్కో” సినిమాకి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. థియేటర్స్‌లో బంపర్ హిట్ అయిన ఈ సినిమా, తర్వాత హిందీ సహా ఇతర భాషల్లో విడుదలై కూడా సూపర్ సక్సెస్ సాధించింది. అయితే, సినిమా ఓటిటి రిలీజ్ విషయంలో మాత్రం పెద్ద వివాదం చెలరేగి, ఆ సమయంలో బాగా చర్చనీయాంశమైంది.

ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పుడు “మార్కో” సీక్వెల్ అధికారికంగా కన్‌ఫర్మ్ అయింది. కానీ ఇక్కడే షాకింగ్ ట్విస్ట్ ఉంది.

లార్డ్ మార్కో – కానీ ఉన్ని లేకుండా!

తాజాగా మలయాళ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, నిర్మాతలు “లార్డ్ మార్కో” అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నారు. అంటే సీక్వెల్ రాబోతుందనేది ఖాయం. కానీ అసలైన సర్ప్రైజ్ ఏంటంటే — ఈ ప్రాజెక్ట్‌లో ఉన్ని ముకుందన్ భాగం కానని స్పష్టం .

గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇంతకు ముందు ఉన్ని స్వయంగా “మార్కోకి ఎప్పటికీ సీక్వెల్ ఉండదు” అని ప్రకటించాడు. అయితే ఇప్పుడు మేకర్స్ ఆయన లేకుండానే ముందుకు వెళ్లడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

హీరోగా ఎవరు వస్తారు?

హనీఫ్ అదేని దర్శకత్వంలో తెరకెక్కిన అసలు “మార్కో” సినిమాకి ఉన్న హైప్, సీక్వెల్ పై మరింత అంచనాలు పెంచుతోంది. ఉన్ని లేకపోతే కొత్త హీరోగా ఎవరు వస్తారు? అదే ఇప్పుడు క్యూటియాసిటీ పీక్‌లో ఉంది.

మరో వైపు – ఉన్ని కొత్త బయోపిక్

ఇదిలా ఉండగా, ఉన్ని ముకుందన్ మాత్రం తన తదుపరి ప్రాజెక్ట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తీస్తున్న బయోపిక్ “మా వందే” ను ప్రకటించాడు.

మరి, “లార్డ్ మార్కో”లో నిజంగా ఎవరు హీరోగా ఎంటర్ అవుతారు? అభిమానుల్లో ఇది హాట్ డిబేట్ అవుతోంది.

, , , ,
You may also like
Latest Posts from