భార‌త సంత‌తికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియ‌మ్స్‌.. 9 నెల‌ల త‌ర్వాత స్పేస్ స్టేష‌న్ నుంచి భూమ్మీకి ఇవాళ చేరుకున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం ఆమె హ్యూస్టన్ లోని స్సేస్ సెంటర్ లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తొమ్మది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వ్యోమగాములు తిరిగి రావడంపై ప్రపంచం మొత్తం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఆమెకు స్వాగతం చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.

ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా సునీతా విలియమ్స్ కు వెల్ కమ్ చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు. వ్యోమగాములకు భగవంతుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరారు. చిరంజీవి తన పోస్ట్ లో ఇలా అన్నారు.

ఈరోజు ఆస్ట్రోనాట్స్ భూమి మీదకు చేరుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టమని చిరంజీవి అన్నారు. 8 రోజుల్లో తిరిగిరావాలని వెళ్లి 286 రోజుల తర్వాత భూమికి చేరుకున్నారు. ఆశ్చర్యకరమైన రీతిలో 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు.

సునీతా మీరు గొప్ప ధైర్యవంతులు..మీకు ఎవరూ సాటి రారు అంటూ సోషల్ మీడియా పోస్ట్ లో రాసుకొచ్చారు చిరంజీవి. మీ ప్రయాణం ఒక థ్రిల్లర్‌ అడ్వెంచర్‌ మూవీని తలపిస్తోందని.. ఇదొక గొప్ప సాహసం.. నిజమైన బ్లాక్‌బస్టర్‌ అని రాసారు.

, ,
You may also like
Latest Posts from