గత కొద్ది కాలంగా వరస పెట్టి స్టార్ హీరోల చిత్రాలు రీరిలీజ్ లు అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మెగా స్టార్ చిత్రం రీరిలీజ్ కు రెడీ అవుతోంది. అవును చిరంజీవి నటించిన పవర్‌ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా ‘స్టాలిన్’.
ఈ చిత్రం రీరిలీజ్ కు రంగం సిద్దం అవుతోంది. అయితే రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. కానీ మెగా ఫ్యాన్స్ సాంగ్‌లు, డాన్స్‌లు, ఫ్లెక్సీలు, స్పెషల్ షోలు, రాత్రంతా సెలబ్రేషన్స్‌తో రెడీ అయిపోతున్నారు.
అప్పటి ప్రింట్ ని మళ్ళీ రీమాస్టర్ చేస్తున్న పనులు ఆల్రెడీ మొదలు కాగా ఇపుడు దీని పట్ల ఆడియెన్స్ మంచి ఎగ్జైటింగ్ గా ఉన్నారు. అయితే ఈ చిత్రాన్ని జూన్ లో రీరిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయట.
17 ఏళ్ల తర్వాత కూడా… స్టాలిన్ స్టైల్ మారలేదు!
2006లో స్టాలిన్ విడుదలై పెద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అప్పట్లో “మీరు ఒక మంచి పని చేస్తే… అది ఇంకొంతమందికి ట్రాన్స్ఫర్ అవుతుంది” అనే thought-provoking కాన్సెప్ట్‌ను కమర్షియల్ యాక్షన్ మిక్స్‌లో చూపించి మెప్పించారు.
చిరంజీవి ఓ sincere ex-army manగా కనిపించి, ‘దయతో మానవత్వం ఎలా మారుతుంది’ అనే పాయింట్‌ను హైలైట్ చేశారు.
ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత, స్టాలిన్ తిరిగి థియేటర్లలో అడుగుపెడుతుంటే, అది కేవలం సినిమాకు కాదు… మెగా మేనియాకు కూడా ఒక రీబూత్ లా మారుతోంది!
సోషల్ మీడియాలో #StalinReRelease ట్రెండ్ అవుతూ, ఫ్యాన్స్-made వీడియోలతో హంగామా చేస్తోంది.
చిరు అభిమానులు ‘స్టాలిన్ స్టైల్’లో సోషల్ సేవా కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు – బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లు, అన్నదానాలు!
మెగా స్క్రీన్ మీద… మళ్లీ ‘స్టాలిన్’ మేజిక్!
ఒకవేళ మీరు ఈ సినిమాని మిస్ అయి ఉంటే… ఇది ఓ అవకాశమే కాదు, ఒక మెగా ఎక్స్పీరియన్స్!
ఇంతకంటే రచ్చ ఏం కావాలి?