మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తెరకెక్కించిన ‘ఎల్ 2: ఎంపురాన్’ (L2: Empuraan) సినిమా మార్చి 27న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల మధ్య బాక్సాఫీసు వద్ద రికార్డులు నెలకొల్పిందీ చిత్రం . ఇదే టైటిల్ తో తెలుగులోనూ డబ్బింగ్ అయిన ఈ మూవీ ఇక్కడ పెద్దగా వర్కవుట్ కాలేదు.
మళయాళంలో మాత్రం దుమ్ము దులిపింది. ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి ‘జియో హాట్‌స్టార్’ (Jio Hotstar)లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్లో ఈ చిత్రం సందడి చేయనుంది.
భాక్సాఫీస్ డిటేల్స్ కు వస్తే..
హిట్ మూవీ ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఎల్ 2: ఎంపురాన్’ ప్రేక్షకుల అంచనాలు అందుకుంది. నాలుగున్నర రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరిన ‘ఎంపురాన్’.. ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన (రూ.250+ కోట్లు) మలయాళ మూవీగా అరుదైన రికార్డు సృష్టించింది.
2002లో గుజరాత్లో చోటుచేసుకున్న ఘటనల ఇతివృత్తంగా తెరకెక్కించిన సన్నివేశాలు రాజకీయంగానూ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీంతో, రీ సెన్సార్ అనంతరం కొన్ని మార్పులు చేశారు.