హరిహర వీరమల్లు రిలీజ్‌కు అన్ని హంగులు సమకూర్చుకొని ముస్తాబవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో డైరెక్ట్‌గా పవన్ కల్యాణ్ ఇన్వాల్వ్ కావడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. జూలై 21వ తేదీన హైదరాబాద్‌లో మీడియాతో జరిగిన ఇంటరాక్షన్‌లో పవన్ ఈ సినిమా గురించి చెప్పిన విషయాలు ఈ చిత్రాన్ని ట్రెండింగ్‌లోకి తెచ్చాయి. దాంతో ట్రేడ్, డిస్టిబ్యూటర్ వర్గాల్లో జోష్ పెరుగుతున్నది. ఏరియాల వారీగా బిజినెస్ వ్యాపారాలు ఊపందుకొన్నాయి.
ఈ క్రమంలో పవన్ కల్యాణ్ అభిమానుల్లో ఇప్పుడు సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకి నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నారు. అందిన సమాచారం మేరకు, మైత్రీ సంస్థ దాదాపు రూ. 35 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి ఈ హక్కులను సొంతం చేసుకుందట. నైజాం ప్రాంతంలో విస్తృతంగా రిలీజ్ చేయడానికి వారు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటించగా, బాబీ డేవల్, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, సునీల్ వంటి పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎ.ఎం. రత్నం సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.
ఇదిలా ఉండగా, సినిమా రిలీజ్‌కు ముందుగా ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
హరిహర వీరమల్లు సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమాను సుమారుగా ఏపీ, తెలంగాణలోనే 700 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా రిలీజ్‌కు ఒక రోజు ముందు పెయిడ్ ప్రీమియర్లను భారీగా ప్లాన్ చేశారు. పెయిడ్ ప్రీమియర్లకు, స్పెషల్ షోలకు సుమారు 600 రూపాయల మేర టికెట్ రేట్లు పెట్టారనేది అనధికారికంగా వెల్లడైన సమాచారం. దాంతో ఈ సినిమాపై భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.