నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్‌ ఛానళ్లు పనిచేస్తున్నాయి. మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్‌ పనిచేస్తాయి అంటూ నిర్మాత నాగవంశీ మీడియాపై,యూట్యూబ్ ఛానెల్స్ పై మండిపడ్డారు. తమ తాజా చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’లో కంటెంట్‌ ఉంది కాబట్టే, హిట్ అయిందని,అయినా రివ్యూలు బాగోలేవని నిర్మాత నాగవంశీ మీడియా సీరియస్ అయ్యారు.

పెంచిన టికెట్‌ ధరలను మంగళవారం నుంచి సాధారణ స్థాయికి తీసుకువచ్చామని చెప్పటానికి తాజాగా ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రివ్యూలు, వాటిపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ మీడియాలో, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించరని ప్రశ్నించారు.

నాగ వంశీ మాట్లాడుతూ… ‘‘కంటెంట్‌ లేకపోయినా సీక్వెల్‌ కాబట్టి ఆడుతోంద’ని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎలా ఉన్నా చూడటానికి ‘బాహుబలి2’, ‘పుష్ప2’, ‘కేజీఎఫ్2’ కాదు కదా! సినిమా ఆశించినంత లేకపోయినా చూడటానికి ఇందులో నటించిన వాళ్లేమీ పెద్ద హీరోలు కాదు. ‘కోర్టు’ బాగుంది కాబట్టి చూశారు. పక్క సినిమా బాగోలేక దాన్ని చూడలేదు.

అలాగే ‘మ్యాడ్ స్క్వేర్‌’ బాగుంది కాబట్టి చూస్తున్నారు. వేరే మూవీలు బాగోలేవని దీన్ని చూడటం లేదు. ఇది అందరూ తెలుసుకోవాలి. ‘స్వాతిరెడ్డి’ పాటపైనా కామెంట్లు చేశారు. కంటెంట్‌ లేదు. సెకండాఫ్‌ పండలేదని అంటున్నారు. నేను థియేటర్‌లో చాలాసార్లు సినిమా చూశా. ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. జనాలకు తెలిసినంత బాగా రివ్యూవర్‌లకు తెలియడం లేదా’’

‘‘సినిమా విడుదలై రివ్యూలు వచ్చిన తర్వాత కూడా ప్రెస్‌మీట్‌ పెట్టాను. అప్పుడు వాటిపై నేనేమీ మాట్లాడలేదు. వాళ్ల పని వాళ్లు చేశారు. కానీ, ఆ రివ్యూల మీద సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మీరు (మీడియా) మేమూ కలిసి పనిచేయాలి. నేను సినిమాలు తీసి విడుదల చేస్తేనే మీ వెబ్‌సైట్స్‌ రన్‌ అవుతున్నాయి.

నేను ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్‌ ఛానళ్లు పనిచేస్తున్నాయి. మేము ప్రకటనలు ఇస్తేనే మీ సైట్స్‌ పనిచేస్తాయి. సినిమాను చంపకండి. సినిమా ఆడుతున్నప్పుడు కూడా ‘కంటెంట్‌ లేని మూవీ ఎందుకు ఆడుతుందో తెలియదు’ అంటూ తీర్పులివ్వకండి. సినిమాలు ఆడితేనే మీరూ ఉంటారు. లేకపోతే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి’’ అని నాగవంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

, ,
You may also like
Latest Posts from