గత సంక్రాంతికి 2023లో ‘వీరసింహారెడ్డి’ బరిలో దిగి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు ‘డాకు మహారాజ్’ తో ప్రేక్షకులు ముందుకు వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లో స్టైలిష్ యాక్షన్ కనిపించిన దానికి రెట్టింపు తెరపై కనపడటంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. డాకు తో బాలయ్య సక్సెస్ ని కంటిన్యూ చేయగలిగారని సంబరాలు జరుగుతున్నాయి. డైరక్టర్ బాబీ, బాలయ్యని కొత్తగా చూపించటమే కలిసొచ్చిందంటున్నారు. ఈ నేపధ్యంలో మూడు కలెక్షన్స్ ఎంత అనేది చూద్దాం.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు డాకూ మహారాజ్ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 54 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా థియేటర్ రైట్స్ 80 కోట్లుకు అమ్మారు.

మూడు రోజుల్లో ఈ చిత్రం 2/3 రికవరీ అయ్యిపోయినట్లే. ఇదే ట్రెండ్ మరో రెండు రోజులు కొనసాగితే సంక్రాంతి స్పీడు తగ్గేలోగా బ్రేక్ ఈవెన్ అయ్యిపోతుంది. వీకెండ్ లోనే పెద్ద హిట్ గా నమోదు అవుతుంది.

చిత్రం కథేమిటంటే…. సివిల్ ఇంజీనీర్ సీతారం(బాలయ్య)..చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుని పోతూంటాడు. ఎన్నో గ్రామాలకు అతను దేవుడుగా మారతాడు. అలాంటి సీతారాం జీవితంలో జరిగిన ఓ సంఘటనతో డాకూ మహారాజ్ గా టర్న్ అవుతాడు.

జీపు దిగి గుర్రం ఎక్కి డాకూగా తిరుగుతూంటాడు. ఆ పరిస్దితులు ఏమిటి, అతనికి చిన్న పాప వైష్ణవికి ఉన్న కనెక్షన్ ఏమిటి, ఆమెను రక్షించాలనుకోవటానికి కారణం ఏమిటి, ప్రశాంతంగా సాగిపోతున్న అతని జీవితాన్ని సమూలంగా మార్చిన సంఘటన ఏమిటి వంటి విషయాలుకు సమాధానమే ఈ సినిమా కథ.

, ,
You may also like
Latest Posts from