ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల్లో తెగ చర్చనీయాంశంగా మారింది ఓ కొత్త కాంబినేషన్ — మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ ల కలయికలో ఓ కొత్త సినిమా. ఇది ఇద్దరికి కలిసి వచ్చిన తొలి చిత్రం కావడం, అదీ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఫుల్‌ఫ్లెజ్డ్ మాస్ ఎంటర్టైనర్ కావడంతో ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది.

ఇదే ప్రాజెక్ట్‌లో ఓ ఆసక్తికరమైన కాస్టింగ్ బజ్ వినిపిస్తోంది. తాజాగా నిధి అగర్వాల్‌ను ఇందులో ఓ హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు టాక్. ఇటీవల ప్రభాస్‌తో ద రాజా సాబ్, పవన్ కళ్యాణ్‌తో హరిహర వీరమల్లు సినిమాల్లో నటించింది. అయితే ఆ రెండు సినిమాలు రిలీజ్ కాకపోవటంతో ఆమెకు పెద్దగా క్రేజ్ రాలేదు. కానీ ఇప్పటికే హరిహర వీరమల్లు చూసిన త్రివిక్రమ్… నిథి ఫెరఫార్మెన్స్ నచ్చి వెంకీ ప్రాజెక్టుకు అడుగుతున్నట్లు తెలుస్తోంది.

దాదాపు నాలుగేళ్ల పాటు రెండు పాన్-ఇండియా ప్రాజెక్టుల్లో మునిగిపోయిన నిధి… ఇప్పుడు వెంకటేష్ వంటి సీనియర్ హీరోతో స్క్రీన్‌షేర్ చేయబోతున్నారని సమాచారం. ఇది ఆమె కెరీర్‌కు రీబూట్ లా మారుతుందా? లేదంటే మళ్లీ అదే గ్లామర్ ఇమేజ్‌తో మిగిలిపోతుందా? అన్నదీ చూడాల్సిన విషయం.

బాక్సాఫీస్ పరంగా నిధికి పెద్దగా హిట్స్ లేకపోయినా… త్రివిక్రమ్ మూవీగా వస్తుండటం, వెంకీ మామ మాస్ మానర్‌లో కనిపించనున్నాడన్న ప్రచారం ఈ సినిమాకు మామూలు రెస్పాన్స్‌ తీసుకొస్తుండటమే కాదు, నిధికి గోల్డెన్ ఛాన్స్‌లా మారే అవకాశముంది.

, , ,
You may also like
Latest Posts from