కొన్ని కండీషన్స్ వినటానికి ఆశ్చర్యంగా ఉంటాయి. కానీ వాళ్లు అప్పుడు ఉన్న పరిస్దితులను బట్టి అలాంటివి తప్పవు. ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu), ‘ది రాజాసాబ్’ (The Raja Saab) చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతన్న నటి నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) అలాంటి క్లాజ్ ఎదురై ఆశ్చర్యపోయిందిట. తాజాగా ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె పాల్గొని కొన్ని విషయాలు రివీల్ చేసారు.
నిథి అగర్వాల్ మాట్లాడుతూ… ‘‘మున్నా మైకేల్’తో సినీ పరిశ్రమలో నా కెరీర్ మొదలైంది. ఇదొక బాలీవుడ్ చిత్రం. టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా నటించారు. ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత టీమ్ నాతో ఒక కాంట్రాక్ట్‌పై సంతకం చేయించుకుంది. సినిమాకు సంబంధించిన నేను పాటించాల్సిన విధి విధానాలు ఆ కాంట్రాక్ట్‌లో పొందుపరిచి ఉన్నాయి. అందులోనే నో డేటింగ్ అనే షరతు పెట్టారు.
సినిమా పూర్తయ్యేవరకూ హీరోతో నేను డేట్ చేయకూడదని దాని సారాంశం. కాంట్రాక్ట్ మీద సంతకం చేసినప్పుడు నేను పెద్దగా ఇవన్నీ చదవలేదు. ఆ తర్వాతే నాక్కూడా ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయా. నటీనటులు ప్రేమలో పడితే వర్క్‌పై దృష్టిపెట్టరని ఆ టీమ్ భావించి ఉండొచ్చు. అందుకే ఇలాంటి షరతులు పెట్టి ఉంటుందనుకున్నా’’ అని నిధి అగర్వాల్ తెలిపారు.
ఆమె హీరోయన్ గా నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ మే 9న విడుదల కానుంది.