‘బలగం’తో సంచలనం సృష్టించిన కమెడియన్‌–టర్న్‌–డైరెక్టర్ వేణు, ఇప్పుడు మరో తెలంగాణా నేపధ్యపు డ్రామా కథ “ఎల్లమ్మ” ను సిద్ధం చేశాడు. ఈ కథలో భావోద్వేగ ప్రేమకథ కూడా ప్రధానంగా నడుస్తుంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా ఉత్సాహంగా చేయటానికి ముందుకు వచ్చారు. అయితే హీరో మాత్రం సెట్ కావటం లేదు.

మొదట ఈ ప్రాజెక్టులో హీరో నితిన్‌ తో ఎగ్రిమెంట్ కుదిరింది. నిర్మాత దిల్ రాజు ఆగస్టులో షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రకటించాడు కూడా. కానీ ‘రాబిన్‌హుడ్’, ‘తమ్ముడు’ సినిమాలు వరుసగా నిరాశపరిచిన తర్వాత, దిల్ రాజు ఈ సినిమాను లాభాల వాటా పద్ధతిలో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ ఆఫర్‌ నితిన్‌కి నచ్చకపోవడంతో ఆయన ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.

అలా ఇప్పుడు “ఎల్లమ్మ” ఇప్పుడు శర్వానంద్ దృష్టిలో పడింది. అయితే ఇంకా ఏ నిర్ణయం ఖరారు కాలేదు. చర్చలు కొనసాగుతున్నాయి. శర్వానంద్ సాధారణంగా తన రెమ్యూనరేషన్‌ విషయంలో రాజీ పడడు. సరైన పారితోషికం లభిస్తేనే సంతకం చేస్తాడు. ప్రస్తుతం ఆయనకు మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కాబట్టి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే, “ఎల్లమ్మ” వచ్చే ఏడాది నుంచి పట్టాలెక్కే అవకాశం ఉంది.

, , , ,
You may also like
Latest Posts from