సూపర్‌స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు రోజు, అభిమానులు #SSMB29 నుంచి భారీ అప్‌డేట్ వస్తుందని ఊహించారు. కానీ జక్కన్న స్టైల్లో సర్ప్రైజ్!
రాజమౌళి ప్రీ-లుక్ ఫోటోని షేర్ చేస్తూ – “ఇది నార్మల్ మూవీ కాదు… గ్రాండ్‌గా, ప్రపంచ స్థాయిలో వస్తుంది. కేవలం ఇమేజ్ రిలీజ్‌తో స్టోరీకి న్యాయం కాదుగానీ… నవంబర్ 2025లో మహేశ్ లుక్‌ను రివీల్ చేస్తాం” అని క్లారిటీ ఇచ్చాడు. #GlobeTrotter ట్యాగ్‌తో హీరో ప్రపంచం చుట్టే పాత్రలో ఉంటాడని హింట్ ఇచ్చేశాడు.
వారిని ఉద్దేశిస్తూ రాజమౌళి (SS Rajamouli) ప్రత్యేక పోస్ట్ లో…. ‘‘మేం ఈ సినిమా షూటింగ్‌ను ఇటీవలే ప్రారంభించాం. దీనిపై మీ అందరి ఆసక్తి చూసి ఎంతో ఆనందంగా ఉంది. ఇది చాలా భారీస్థాయిలో రానుంది. కేవలం ప్రెస్‌మీట్ పెట్టి లేదా కొన్ని ఇమేజ్‌లు విడుదల చేయడం వల్ల స్టోరీకి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేము. దీన్ని భారీఎత్తున రూపొందిస్తున్నాం. నవంబర్ 2025లో మహేశ్ లుక్‌ను విడుదల చేస్తాం. గతంలో ఎప్పుడూ చూడనివిధంగా దీన్ని రూపొందిస్తున్నాం. మీరంతా సహకరిస్తారని ఆశిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
మహేశ్ బాబు కూడా స్పందిస్తూ – “మీలాగే నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా… నవంబర్‌లో మీతో పాటు నేనూ ఎంజాయ్ చేస్తా” అంటూ ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ మూడింతలు చేశారు.
అటవీ నేపథ్యం, గ్లోబల్ అడ్వెంచర్‌తో కూడిన ఈ పాన్-వరల్డ్ మూవీ కోసం ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తదుపరి షెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలో జరగనుంది. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు.