
రాజమౌళి స్ట్రాటజీ ని ఫాలో చేస్తున్న ఎన్టీఆర్ “డ్రాగన్”!
మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న “వారణాసి” టైటిల్ రివీల్ ఈవెంట్ బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ఆన్లైన్ పోస్టర్, ప్రెస్ మీట్, లేదా థియేటర్ అనౌన్స్‌మెంట్‌తో సరిపెట్టే టైటిల్ లాంచ్‌ను…వారుణాసి టీమ్ పక్కా గ్లోబల్ స్టేజ్‌గా మార్చేసింది.
లైవ్ ఆడియన్స్, గ్రాండ్ స్టేజ్, వరల్డ్ మీడియా — ఇలా అన్ని భాషల్లో ఒకేసారి బజ్ క్రియేట్ చేశారు. అదే గేమ్‌ప్లాన్‌ను ఇప్పుడు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో కూడా ఫాలో అవుతోందట! గ్రాండ్ ఈవెంట్ – గ్లోబల్ మీడియా – ఇంటర్నేషనల్ బజ్
ఈసారి ఎన్టీఆర్ సినిమా టీమ్ కూడా ఇలా మీకు అచ్చం వారణాసిలానే,
విజువల్ స్టేజ్,
కాస్ట్ & క్రూ స్పీచెస్,
వరల్డ్ మీడియా ఇన్విటేషన్,
బహుభాషా ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ తో టైటిల్ & ఫస్ట్ గ్లింప్స్‌ను భారీ ఈవెంట్లోనే రిలీజ్ చేయాలని ఖరారు చేసినట్టు ఇండస్ట్రీలో హాట్ టాక్.
“డ్రాగన్” టైటిల్ ఫిక్సా? మైత్రీ రవి క్లారిటీ ఇచ్చాడా?
ప్రొడ్యూసర్ మైత్రీ రవి తాజాగా రూమర్స్‌పై రియాక్ట్ అవుతూ… “డ్రాగన్ కూడా ఓ ఆప్షన్ మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ కాదు. సినిమా స్కేల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. నీల్ చూపించబోయే ఎన్టీఆర్ పూర్తిగా కొత్త లుక్” అని చెప్పారు. అంటే… టైటిల్ ఇంకా మేకర్స్ చేతిలో పూర్తిగా సీక్రెట్. ఫ్యాన్స్ ఊహించలేని భారీ కాన్సెప్ట్, కొత్త షేడ్స్!
ఎందుకు ఈ క్రేజ్ లెవెల్ ఈవెంట్?
ఈవెంట్లోనే థీమ్, క్యారెక్టర్, కాన్సెప్ట్ అన్నీ ప్రాపర్‌గా బ్రేక్ చేస్తే…
ఇండియన్ ఆడియెన్స్‌కి క్లారిటీ
హాలీవుడ్ & ఇంటర్నేషనల్ మీడియా దృష్టి
వరల్డ్‌వైడ్ మార్కెట్లలో ఇమేజ్ బిల్డింగ్
ఫస్ట్ డే బాక్సాఫీస్‌పై డైరెక్ట్ ఇంపాక్ట్
ప్రస్తుతం “ఎన్టీఆర్ – నీల్” కాంబోపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని దృష్టిలో పెట్టుకుని… ఈవెంట్‌ను ఇండస్ట్రీలో సంవత్సరపు అతిపెద్ద రివీల్ లాగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ కొత్త షేడ్… నీల్ మాస్ విజన్… టైటిల్ మిస్టరీ!
ఈసారి ఎన్టీఆర్ ఏ లుక్‌లో కనిపిస్తాడు? నీల్ ఏ రేంజ్ యాక్షన్ డిజైన్ చేశాడు? టైటిల్ నిజంగానే “డ్రాగన్”నా లేదా మరింత క్రేజీగా ఉందా? ఈవెంట్ డేట్ వస్తేనే అసలు హంగామా మొదలవుతుంది. అంతవరకు… ఎన్టీఆర్ – నీల్ మూవీ టైటిల్ రివీల్ ఇండస్ట్రీ మొత్తం వాచ్ చేస్తున్న హాట్ టాపిక్ గా మారిపోయింది!
