
బెంగళూరు ఎన్టీఆర్ అడ్డాగా మారిపోయిందా? ఆసుపత్రి ప్రారంభోత్సవంలో అసలేం జరిగింది? ఆ వీడియోలు చూస్తే ఫ్యూజులు అవుట్!
యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ తాజాగా బెంగళూరులో జరిగిన ఒక ఘటన చూస్తుంటే తారక్ రేంజ్ ఏంటో అర్థమవుతోంది. కేవలం ఒక హాస్పిటల్ వింగ్ ప్రారంభోత్సవానికి వెళ్తే, అక్కడ కనిపించిన జన ప్రభంజనం చూసి స్థానికుల మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ రోజు కూడా లేనంత హడావిడి అక్కడ కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కిమ్స్ హాస్పిటల్ వద్ద జన సముద్రం.. ట్విట్టర్ లో ఎన్టీఆర్ నామస్మరణ!
బెంగళూరులోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి చెందిన ఒక వింగ్‌ను ప్రారంభించేందుకు ఎన్టీఆర్ వెళ్లగా, అభిమాన గణం అక్కడికి పోటెత్తింది. తారక్‌ను ఒక్కసారి చూసేందుకు జనం ఎగబడటంతో పోలీసులు కూడా నియంత్రించలేకపోయారు. ఆ ఫోటోలు, వీడియోలు ట్విట్టర్ (X) లో హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా ఫీడ్ అంతా ఎన్టీఆర్ నామస్మరణతో ట్రెండ్ అవుతోంది. బెంగళూరులో ఉండే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్‌లో ఎక్కువ మంది తెలుగు వారు ఉండటం, వారంతా ఎన్టీఆర్ మాస్ మేనియాకు ఫిదా అవ్వడం ఈ రేంజ్ రెస్పాన్స్‌కు కారణం.

ఫ్లాపులతో సంబంధం లేని క్రేజ్.. వార్ 2 ఎఫెక్ట్ జీరో!
ఇటీవల ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు, బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతిన్న మాట వాస్తవమే. కానీ ఆ ప్లాప్ ఎఫెక్ట్ తారక్ ఇమేజ్ను ఇసుమంతైనా తగ్గించలేకపోయింది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తన క్రేజ్ ఇంకా పెరుగుతోందని బెంగళూరులో కనిపించిన ఈ సీన్ నిరూపించింది. ఒక్క పిలుపు ఇస్తే జనం ఏ రేంజ్లో ఊగిపోతారో ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది.
Sher Aa gaya 🐯#NTR pic.twitter.com/8ZRgSjbejM
— Milagro Movies (@MilagroMovies) March 8, 2026
తారక్ విధ్వంసం మొదలైంది.. ఇక బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!
Be Safe Guys 🙏
— Milagro Movies (@MilagroMovies) March 8, 2026
Escalator Glass Damaged #NTR pic.twitter.com/E1Oxx9XByM
హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు గ్లోబల్ లెవల్లో తన పవర్ చూపిస్తున్నాడు. సినిమాలతోనే కాదు, ఇలాంటి పబ్లిక్ ఈవెంట్లలో కూడా తనకున్న ఫాలోయింగ్‌తో పూనకాలు తెప్పిస్తున్నాడు. మరి రాబోయే సినిమాలతో తారక్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
Tarak Anna’s love for his fans is eternal. 🫂❤️🩹#NTR pic.twitter.com/B7ggAqE9uu
— Salaarodu (@Tweets_pillodu) March 8, 2026
