తెలుగులో వచ్చిన గొప్ప పౌరాణిక చిత్రం ‘మాయాబజార్’. కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. ఇది తెలుగు తెరపై ఓ సెల్యులాయిడ్ కావ్యంగా నిలిచిపోయింది. 1957లో రిలీజైన ఈ చిత్రం ఈ ఏడాదితో 68 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మరోసారి థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్, అభిమన్యుడిగా ఏఎన్నార్, ఘటోత్కచుడుగా ఎస్వీ రంగారావు, శశిరేఖగా సావిత్రి నటించిన ఈ చిత్రం అప్పటికీ ఇప్పటికీ సెన్సేషనే. ఈ సినిమాను ఈ నెల 28న రీరిలీజ్ చేస్తున్నారు.
రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఈ ఏడాది ఇప్పటికే అనేక పాత సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రీసెంట్ గా ‘భైరవద్వీపం’ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లాంటి క్లాసిక్ సినిమాలను రీరిలీజ్ చేసారు. ఈ క్రమంలో ‘మాయాబజార్’ చిత్రం మళ్ళీ తెర మీదకు రాబోవటం అభిమానులను ఆనందపరుస్తోంది.