పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్ ‘OG’ బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం ఘాటైన దుమ్మురేపింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇన్వెస్ట్‌మెంట్‌లో 69% రికవరీ సాధించగా… ఓవర్సీస్ & ROI లో అయితే అదరగొట్టేసింది.

ప్రత్యేకంగా ఓవర్సీస్‌లో ‘OG’ కలెక్షన్స్ అంచనాలు మించిపోయి… పెట్టుబడులు తిరిగి తీసుకొచ్చేసాయి. ROIలో కూడా సాలిడ్ రికవరీతో బయ్యర్లకు ఊరటనిచ్చింది. మొత్తానికి, ఫస్ట్ వీక్ వరల్డ్‌వైడ్ రికవరీ 80% దాటేసింది.

ఇప్పుడు అసలు టార్గెట్ సెకండ్ వీక్‌ఎండ్! దసరా, గాంధీ జయంతి హాలిడే బూస్ట్ తో ‘OG’ బయ్యర్లకు బ్రేక్ ఈవెన్ + హిట్ స్టేటస్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు ట్రేడ్ వర్గాలు.

‘OG’ ఫస్ట్ వీక్ వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్

నిజాం – ₹ 43.5 కోట్లు
సీడెడ్ – ₹ 13 కోట్లు
ఉత్తరాంధ్ర (UA) – ₹ 12.5 కోట్లు
గుంటూరు – ₹ 9.5 కోట్లు
ఈస్ట్ గోదావరి – ₹ 10 కోట్లు
వెస్ట్ గోదావరి – ₹ 7.1 కోట్లు
కృష్ణా – ₹ 8.5 కోట్లు
నెల్లూరు – ₹ 3.9 కోట్లు
ఏపీ/టీఎస్ టోటల్ – ₹ 108 కోట్లు
ROI (అప్రాక్స్) – ₹ 9.25 కోట్లు
ఓవర్సీస్ – ₹ 29.5 కోట్లు
వరల్డ్‌వైడ్ టోటల్ – ₹ 146.75 కోట్లు

దసరా వీక్‌ఎండ్‌లో ‘OG’ టెలుగు స్టేట్స్‌లో కూడా దూసుకెళ్లి బయ్యర్లకు హిట్ స్టేటస్ అందిస్తుందా? లేక ఇంకా స్ట్రగుల్ చేస్తుందా?

, , , ,
You may also like
Latest Posts from