పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన OG నిన్న రాత్రి పెయిడ్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండటంతో అభిమానుల్లో హై వోల్టేజ్ జోష్ నెలకొంది. ఈ సందర్భంగా సినిమా టీమ్ ఓ ప్రెస్ మీట్ పెట్టి అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది.

ఆ ప్రెస్ మీట్‌లోనే డైరెక్టర్ సుజీత్ షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.

OG – సాహో క్రాస్ ఓవర్ గురించి మాట్లాడిన సుజీత్…

“ఇంకా చాలా ఎర్లీ. ముందుగా ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ అవుతారో చూడాలి. తరువాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. కానీ పవన్‌గారు, ప్రభాస్ ఇద్దరూ ఓకే అంటే ఖచ్చితంగా చేయొచ్చు” అని చెప్పాడు.

అలాగే… “నా మైండ్‌లో యూనివర్స్ ఐడియా ఉంది కానీ ఇంకా ఫైనల్ కాన్సెప్ట్ లేదు. టైమ్‌తో క్లారిటీ వస్తుంది” అని సుజీత్ క్లారిటీ ఇచ్చాడు.

ఇంకా షాకింగ్ డీటెయిల్ ఏంటంటే –

క్రాస్ ఓవర్ జరిగితే పవన్ కళ్యాణ్ – ప్రభాస్ ఇద్దరినీ బ్రదర్స్‌గా చూపించే అవకాశం ఉందట! ఎందుకంటే, సినిమాలో గంభీరా అనేది సత్యా దాదా దత్తపుత్రుడు. సాహో మాత్రం రాయ్ కొడుకు. రాయ్, దాదా బ్రదర్స్ కాబట్టి… ఇది లాజికల్‌గా కనెక్ట్ అవుతుందని చెప్పాడు.

అదే సమయంలో సుజీత్ పోస్ట్ క్రెడిట్స్ సీన్‌ను ఓపెన్ ఎండింగ్‌గా వదిలేశాడు.
“పవన్ గారు ఇప్పుడు ప్రజా నాయకుడు. ఫ్యూచర్‌లో సీక్వెల్ ఎలా, ఎప్పుడు అనేది చెప్పలేను. అందుకే ‘అవసరమైతే తిరిగి వస్తా’ అన్న డైలాగ్‌తో వదిలేశాను” అని చెప్పాడు.

మరోవైపు, థియేటర్లలో పెద్ద రియాక్షన్ తెచ్చిన “జానీ – తమ్ముడు” రిఫరెన్స్ క్రెడిట్ మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌దే అని సుజీత్ రివీల్ చేశాడు.

సుజీత్ మాటల ప్రకారం, భవిష్యత్తులో OG – సాహో యూనివర్స్ ఓ రియాలిటీ కావచ్చు! పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఒకే స్క్రీన్ మీద బ్రదర్స్‌గా కనిపించే ఆలోచన ఒక్కటే అభిమానుల్లో థ్రిల్ కలిగిస్తోంది.

, , , , ,
You may also like
Latest Posts from