ఈ శుక్రవారం (జూలై 25) మీ సోఫా మీదే థియేటర్ ఫీల్ అందబోతోంది. శుక్రవారం రాగానే సినిమా లవర్స్‌కు పండగే. థియేటర్లు తీరాన పండగలా ఉంటే, ఓటీటీలు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ వారం కూడా అన్ని భాషల్లో క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీలు, ఎమోషనల్ డ్రామాలు, రియాలిటీ షోలు… ఇలా విభిన్నమైన కంటెంట్‌తో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సిద్ధంగా ఉన్నాయి.
తెలుగులో నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా వచ్చిన ‘షో టైమ్’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అలాగే విజయ్ ఆంటోనీ నటించిన సైకో థ్రిల్లర్ ‘మార్గన్’ కూడా ఇప్పుడు ఓటీటీలో. థియేటర్లలో మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు హోమ్ స్క్రీన్లపై అదృష్టం పరీక్షించుకుంటోంది.
హిందీలో ‘సర్జమీన్’, ‘రంగీన్’, ‘మండల మర్డర్స్’ వంటి థ్రిల్లర్ & డ్రామాలు స్ట్రీమింగ్‌కి వచ్చాయి. అంతేకాదు, మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘రోంత్’ ఇప్పుడు తెలుగులో డబ్బింగ్‌తో జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
కొరియన్ ఫ్యాన్స్‌కి నెట్‌ఫ్లిక్స్‌పై ‘ది విన్నింగ్ ట్రై’, ‘ట్రిగ్గర్’, ‘ద ప్లాట్’ లాంటి ఇంటెన్స్ మూవీస్ అండ్ సిరీస్ లు వచ్చాయి. కామెడీ ఆడియెన్స్ కోసం ‘హ్యాపీ గిల్మోర్-2’, హారర్ లవర్స్ కోసం ‘ఆంటిక్ డాన్’ కూడా ఉంది.
పంజాబీ సినిమాలు ఇష్టపడేవాళ్ల కోసం జీ5లో సౌంకన్ సౌంకనీ 2, అలాగే లయన్స్ గేట్ ప్లేలో జానీ ఇంగ్లీష్ స్ట్రైక్స్ అగైన్, ద సస్పెక్ట్ వంటి ఎంటర్‌టైనింగ్ కంటెంట్ సిద్ధంగా ఉన్నాయి.
ఇంతకీ ఈ వీకెండ్ మీరు ఏ సినిమాతో బిజీ అవ్వబోతున్నారు?
థ్రిల్లర్ ? లేక కామెడీ? మీ వాచ్‌లిస్ట్ రెడీ చేసుకోండి!