‘హరిహర వీరమల్లు’ ఏ ముహూర్తాన మొదలెట్టారో కానీ వాయిదాల మీద వాయిదాల పడుతోంది. ఎప్పుడు మొదలెట్టినా ఏదో సమస్యతో వెనక్కి వెళ్తోంది. ఇప్పటికే నాలుగేళ్లు అయ్యింది మొదలెట్టి. డైరక్టర్ సైతం మారారు. ఇన్నాళ్లకు మల్లీ సెట్స్ పైకి వచ్చింది. చివరి షెడ్యూల్ లో పవన్ జాయిన్ అయినట్టు కథనాలు కూడా వచ్చాయి. వాస్తవానికి ఈరోజు షూటింగ్ లో పవన్ జాయిన్ అవ్వలేదు.
అందుకు కారణం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు.
అలాగే పవన్ కళ్యాణ్ ని స్పాండిలైటిస్ సమస్య కూడా వెంటాడుతోంది. ఆయన వైద్యుల పర్యవేక్షణలో బెడ్ రెస్ట్ తీసుకున్నారు.
దీంతో హరిహర వీరమల్లు సెట్స్ పైకి పవన్ ఎప్పుడు వస్తారనేది అనుమానంగా మారింది. ఈ సినిమాకు సంబంధించి ఇదే ఫైనల్ షెడ్యూల్.
తాజాగా సునీల్, కబీర్ దుహాన్ సింగ్, నాజర్ లాంటి నటులపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు.
పవన్ నాలుగైదు రోజుల్లో కోలుకొని సెట్స్ పైకి వస్తారని, ఈ నెలాఖరుకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని యూనిట్ చెబుతోంది.