
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ‘They Call Him OG’ ఈ ఏడాది టాలీవుడ్‌లో బాక్సాఫీస్ కలెక్షన్స్‌కి కొత్త నిర్వచనం ఇచ్చిన సినిమా!. ఓపెనింగ్స్ నుంచి ఎండ్ వరకు 300 కోట్లకు పైగా వసూళ్లతో 2025లోనే అత్యధిక గ్రాసర్‌గా నిలిచిన ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా ఐదు భాషల్లో ‘ఓజీ’ అందుబాటులోకి వచ్చేసింది. కానీ… స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యిన క్షణంలోనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు!
ఫ్యాన్స్ షాక్‌లో – “ఇదేనా అన్‌కట్ వెర్షన్?”
వారాలుగా అభిమానులు కోరుకున్నది ఒక్కటే – “Uncut Version” విడుదల చేయాలని. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయినది మాత్రం థియేట్రికల్ కట్‌నే. అంటే — ఫ్యాన్స్ ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన కొన్ని యాక్షన్ సీక్వెన్సులు, ప్రోమోలలో చూపిన సీన్లు అన్నీ కనిపించలేదు.
ముఖ్యంగా “Kiss Kiss Bang Bang” సాంగ్ ఉన్న కట్ వర్షన్ మాత్రమే వచ్చింది. దాంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో “అంత బజ్ తర్వాత ఇదేనా ఫైనల్ కట్?” అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
“డిలీటెడ్ సీన్స్ రిలీజ్ చేయండి!” డిమాండ్ పెరుగుతోంది
ఫ్యాన్స్ మాట స్పష్టంగా ఉంది. “మేకర్స్ యూట్యూబ్‌లో డిలీటెడ్ సీన్స్ రిలీజ్ చేస్తేనే జనం సంతృప్తి పడతారు!” ఇప్పుడు ఆ డిమాండ్‌తో సోషల్ మీడియాలో #OGUncutVersion ట్రెండ్ అవుతోంది. అయితే నిర్మాతలు దానికి స్పందిస్తారా? లేదా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.
బాక్సాఫీస్‌లో 300 కోట్ల బీభత్సం!
‘ఓజీ’ రన్ నిజంగా ఇండస్ట్రీ రేంజ్ హిట్. పవన్ కళ్యాణ్ ఎనర్జీ, తమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సుజీత్ స్టైలిష్ టేక్ .అన్నీ కలిపి సినిమా ప్యూర్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చాయి. థియేటర్లలో కలెక్షన్స్ తుఫాన్ సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో కూడా అదే హీట్‌ను కొనసాగిస్తుందా అనేది చూడాలి.
స్టార్ క్యాస్ట్
ఎమ్రాన్ హష్మీ, ప్రియాంకా అరుల్ మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రేయా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రల్లో నటించారు. స్పెషల్ సాంగ్‌లో నేహా శెట్టి అదిరిపోయారు. డివివి దానయ్య – కళ్యాణ్ దాసరి నిర్మించిన ఈ సినిమాకు తమన్ ఎస్ సంగీతం మరో స్థాయిలో పాపులారిటీ తెచ్చింది.
ఇప్పుడు ప్రశ్న ఒక్కటే – నెట్‌ఫ్లిక్స్‌లో “అన్‌కట్ ఓజీ” వస్తుందా? లేక ఫ్యాన్స్‌ను మళ్ళీ వేచిచూడమంటారా? దీపావళి వేడుకల మధ్య ఫ్యాన్స్ మాత్రం ఒక్క మాటే చెబుతున్నారు — “పవర్ స్టార్ అన్‌కట్ కట్ కావాలి!” .
