పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం “ఓజీ (OG)”. ప్రస్తుతం తెలుగు పరిశ్రమలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలోనూ ఓ రేంజి క్రేజ్ ఉంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్ “They Call Him OG” (సంక్షిప్తంగా ‘ఓజీ’), విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. రిలీజ్‌కు ఇంకా మూడు వారాలు ఉండగానే, ఉత్తర అమెరికా మార్కెట్‌లోనే ప్రీ సేల్స్ $1 మిలియన్ దాటేయడం టాలీవుడ్‌లో అరుదైన ఘనతనే చెప్పాలి.

ఇది ఎంత వేగంగా సాధించిందో అంటే, రిలీజ్‌కు 21 రోజుల ముందు ఈ మైలురాయిని చేరుకుంది. ‘RRR’ తర్వాత ఈ రికార్డును అంత వేగంగా క్రాస్ చేసిన రెండో తెలుగు సినిమా ఇదే కావడం ప్రత్యేకం. అమెరికాలో సెప్టెంబర్ 24న ప్రీమియర్స్‌తో “ఓజీ” సెన్సేషన్ మొదలవుతుంది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ, “Records are born in his name” అంటూ సోషల్ మీడియాలో ప్రకటించింది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర పాత్రలో కనిపిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మీ విలన్ ఓమీ పాత్ర పోషిస్తున్నారు. వీరి కేరక్టర్స్‌ను హైలైట్ చేస్తూ విడుదల చేసిన స్పెషల్ వీడియో క్లిప్ (సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా) అభిమానుల్లో హైప్‌ను మరింత పెంచింది.

ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం, ఇంత వేగంగా మిలియన్ డాలర్ మైలురాయిని దాటిన “ఓజీ”, వచ్చే వారం లోపలే $2 మిలియన్ మార్క్‌ చేరే అవకాశం ఉంది. అమెరికా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా “ఓజీ”పై క్రేజ్ ఊహించని స్థాయిలో ఉందని చెబుతున్నారు.

డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా, ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచే అన్ని అవకాశాలు కలిగి ఉందని ట్రేడ్ అంటోంది.

, , , , ,
You may also like
Latest Posts from