హరి హర వీర మల్లుతో బాక్సాఫీస్‌లో ఆశించిన ఫలితాలు రాకపోయినా, పవన్ కల్యాణ్ మార్కెట్ విలువ, ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తాజా బిజినెస్ డీల్స్ చెబుతున్నాయి. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ముంబై గ్యాంగ్‌స్టర్ సాగా “ఓజీ” ఈ సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. రిలీజ్‌కి ముందే ఈ సినిమా రికార్డ్ స్థాయి వ్యాపారం సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే ₹135 కోట్లకుపైగా రికార్డు ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించడం పవన్ కెరీర్‌లో ఇదే మొదటిసారి. దీంతో ఆయన ప్రీ-రిలీజ్ రేంజ్ ప్రభాస్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో సమానంగా నిలిచింది. ఇప్పటివరకు ఈ స్టార్‌ల తాజా సినిమాలు ఒక్కొక్కటి ₹130–150 కోట్ల మధ్యలో డీల్ అయ్యాయి. ఆశ్చర్యమేమిటంటే, పవన్ కల్యాణ్ ఈ బెంచ్‌మార్క్‌ను ఊహించిన కంటే చాలా త్వరగా అందుకున్నారు.

డిస్ట్రిబ్యూటర్ల మాటల్లో – “హరి హర వీర మల్లుతో పోలిస్తే ఓజీ మొదటి నుంచి ఎక్కువ హైప్ క్రియేట్ చేసింది. పవన్ స్టైలిష్ మాస్ అవతార్, సుజీత్ విజన్ కలిసి ఓ రికార్డు రన్‌కి దారితీసే అవకాశముంది. దసరా హాలిడే అడ్వాంటేజ్ కూడా బిగ్ ఓపెనింగ్స్‌కి హెల్ప్ చేస్తుంది” అని వ్యాఖ్యానిస్తున్నారు.

ఏదైమైనా ‘ఓజీ’ ప్రీ-రిలీజ్ డీల్స్ పవన్ కల్యాణ్‌ను టాప్ ప్లేస్ లో మరోసారి నిలబెట్టాయి. ఇక అసలు గేమ్ థియేటర్స్‌లో మొదలవుతుంది!

, , ,
You may also like
Latest Posts from