
‘OG’ vs ‘Devara’ బాక్స్ ఆఫీస్ పోటీ మొదటి రోజు నుంచే హాట్ టాపిక్. పవన్ కళ్యాణ్ ‘OG’ అమెరికాలో తెలుగువర్షన్‌లో ‘దేవర’ను ఓడించింది. కానీ మొత్తం ఓవర్‌సీస్ కలెక్షన్లలో మాత్రం NTR సినిమా ముందంజలో ఉంది.
పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ నార్త్ అమెరికా టోటల్ గ్రాస్ $5.55 మిలియన్, అందులో హిందీ వెర్షన్ కేవలం $42K మాత్రమే. అంటే తెలుగు వెర్షన్ మాత్రమే దాదాపు $5.51 మిలియన్ వసూలు చేసింది. దీని వల్ల ‘OG’ ‘దేవర’ తెలుగు వెర్షన్ ($5.5 మిలియన్) ను దాటేసింది.
‘They Call Him OG’ ఇప్పుడు టాలీవుడ్‌లో నార్త్ అమెరికా తెలుగు వెర్షన్ టాప్ 7 గ్రాసర్‌లలో ఒకటి.
అయితే అన్ని భాషల కలెక్షన్లు కలిపి చూస్తే NTR యొక్క ‘దేవర’కు స్పష్టమైన ఆధిక్యం.
‘దేవర’ నార్త్ అమెరికా మొత్తం కలెక్షన్ $6.07 మిలియన్, అందులో హిందీ వెర్షన్ $562K, తమిళం $15K, మొత్తం OG కంటే $1.5 మిలియన్ ఎక్కువ.
మొత్తం ఓవర్‌సీస్ లో —
‘దేవర’ మొత్తం కలెక్షన్ $9 మిలియన్
‘OG’ కలెక్షన్ $7.5 మిలియన్
చివరికి — అమెరికా తెలుగువర్షన్‌లో OG గెలిచినా,
ఓవర్‌సీస్ మొత్తం లెవెల్‌లో మాత్రం NTR దేవర మాస్!
