బుట్టబొమ్మ పూజాహెగ్డే కొద్ది కాలం క్రితం తెలుగులో హీరోయిన్‌గా స్టార్ హోదా దక్కించుకుని ఓ వెలుగు వెలిగింది. అంతే కాదు తెలుగుతో పాటు దక్షిణాది, హిందీలో బడా స్టార్ట్స్‌తో మూవీస్ చేసింది. అయితే ఆమెకు వరస ఫ్లాప్స్ లు వెంబడించేసాయి. ఈ టైంలో యాక్టింగ్ విషయంలో పూజా.. ఓ అనుహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే వెబ్ సీరిస్ చేయటం.

ఓటీటీ వెబ్ సిరీస్ ల‌కు ఉన్న డిమాండ్ ని పసిగట్టిన విక్ట‌రీ వెంక‌టేష్ , రానాలు ఆ దిసగా ప్రయాణం పెట్టుకున్నారు. అలాగే సీనియ‌ర్ భామ‌లు తమన్నా, సమంత కూడా ఓటీటీ వెబ్ సిరీస్ ల‌కు ఇస్తోన్న ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. తాజాగా ముంబై బ్యూటీ పూజాహెగ్డే కూడా ఓటీటీ తెరంగేట్రానికి రెడీ అవుతోంది.

డీమోంటే కాలనీ, కోబ్రా చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా ఫేమ‌స్ అయిన అజయ్ జ్ఞానముత్తు నెట్ ఫ్లిక్స్ వేదిక‌గా ఓ వెబ్ సిరీస్ కి రంగం సిద్దం చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ కి పూజాహెగ్డే సైన్ చేసిన‌ట్లు వార్తలు వస్తున్నాయి.

ప్ర‌స్తుతం పూజాహెగ్డే చెన్నైలో ఉంటూ చక్రం తిప్పే పనిలో ఉంది. వరస పెట్టి ఈ బుట్టిబొమ్మ ఎక్కువ‌గా త‌మిళ సినిమాలే క‌మిట్ అవుతోంది. సూర్య తో చిత్రం…విజ‌య్ తో జ‌న నాయ‌గ‌న్ చేస్తుంది. అలాగే కాంచ‌న 4 లోనూ ఎంపికైంది. కూలీలో ఐటం పాట‌లోనూ న‌టిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే మరో ఆలోచ‌న లేకుండా కోలీవుడ్ వెబ్ సిరీస్ కి రెడీ అయింది.

, ,
You may also like
Latest Posts from