ఒకసారి ఊహించండి ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్ పవర్ ఒకేసారి తెరపై బ్లాస్ట్ అయితే? థియేటర్స్ షేక్ అవుతాయి, ఫ్యాన్స్ ఎంజాయ్‌లో పిచ్చెక్కిపోతారు, అది పాన్‌ఇండియా లెవెల్ సునామీ అవుతుంది. అలాంటి డ్రీమ్ కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో బజ్ రావడంతో, నెటిజన్లు ఫుల్ ఎక్సైట్ అయ్యారు.
రూమర్ ఏంటంటే, సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న “స్పిరిట్” లో చిరంజీవి, ప్రభాస్ తండ్రి పాత్రలో ఎంట్రీ ఇస్తారని. ఫ్లాష్‌బ్యాక్‌లో మెగా-రెబల్ కాంబో హైలైట్ అవుతుందని హడావిడి జరిగింది.
కానీ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే ఇది అంతా ఫేక్ న్యూస్ !
మెగాస్టార్ సోషల్ మీడియా టీమ్ ఆ రూమర్‌కి క్లారిటీ ఇచ్చి, చిరంజీవి “స్పిరిట్”లో లేరని ఆఫీషియల్‌గా డినై చేసింది.
ప్రస్తుతం మూవీ ప్రీ-ప్రొడక్షన్‌లో ఉంది. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్ళాలనుకున్నా, ప్రభాస్ కమిట్‌మెంట్స్ (“రాజా సాబ్”, “ఫౌజీ”) వల్ల వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ.
అందుకే ప్రభాస్ – చిరంజీవి ఒకే ఫ్రేమ్‌లో చూడాలంటే ఇంకా వెయిట్ చేయాల్సిందే !