‘రాజా సాబ్’ షూటింగ్ కోసం ప్రభాస్ టీమ్ ప్రస్తుతం గ్రీస్‌లో ఉంది. రోడ్‌స్ ఐలాండ్ సమీపంలో ప్రభాస్, నిధి అగర్వాల్‌పై ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. అయితే అక్కడి నుంచి ప్రభాస్ లేటెస్ట్ లుక్స్ లీక్ కావడంతో సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆ ఫోటోల్లో ప్రభాస్ చాలా యంగ్, ఎనర్జిటిక్ లుక్‌లో కనిపిస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.

ఈ నెలాఖరుకు పాటల షూట్ పూర్తవుతుందని, దీంతో ‘రాజా సాబ్’ మొత్తం షూటింగ్‌ కూడా ముగుస్తుందని సమాచారం.

ఇకపోతే, మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం కోసం మేకర్స్ భారీ బడ్జెట్ ఖర్చు చేశారు.

ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు కాగా, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది.

, , , , , ,
You may also like
Latest Posts from