డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా ‘పౌజీ’ పై రోజు రోజుకి ఎక్సపెక్టేషన్స్ మరింత పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి హను రాఘవపూడి ద‌ర్శ‌కత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంభందించిన ఓ వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అది మరేదో కాదు ఈ సినిమాలో ప్రభాస్ ..బ్రాహ్మణ కుర్రాడిగా కనిపించబోతున్నారట.

ఈ సినిమా అగ్రహారంలో ఉంది.. ఒక సాంప్రదాయమైన ఫ్యామిలీలో పుట్టిన ఒక బ్రాహ్మణుడి కథ చుట్టూ తిరుగుతుందంట.

ప్రభాస్ ఇందులో బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నారని సమాచారం.

ఇది సీతారామం తరహాలో ప్రేమకథ అయినా, కథా పరిణామాలు.. పూర్తిగా విభిన్నంగా ఉంటాయి అని తెలుస్తోంది.

‘పౌజీ’ సినిమా కథ 1940ల కాలం నేపథ్యంలో సాగుతుండగా, ఇందులో అనేక ట్విస్ట్‌లు ఉండబోతున్నాయి.

హను రాఘవపూడి తనదైన శైలిలో ప్రేమ కథ, గుండెకు హత్తుకునేలా డ్రామా, భారీ యాక్షన్ సీన్స్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో దేశభక్తి నేపథ్యంతో పాటు, స్వాతంత్య్రానికి ముందు గడిచే రోజులని కూడా చూపించనున్నారు.

ప్రభాస్‌కి జోడీగా ఇమాన్వీ ఇస్మాయిల్‌ను సెలెక్ట్ చేసారు. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్‌కి సంబంధించిన కొన్ని భాగాలు పూర్తి కాగా, కొత్త షెడ్యూల్‌ కొద్దిగా ఆలస్యంగా ప్రారంభం కానుంది. అయితే, ‘పౌజీ’ యూనిట్ ప్రస్తుతం భారీ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

, , ,
You may also like
Latest Posts from