‘లవ్ టుడే’తో యువతను ఊపేసిన ప్రదీప్ రంగనాథన్, ఇటీవల ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’తో మరో విజయం అందుకున్నాడు. ఇప్పుడు అదే జోష్‌తో తన నెక్స్ట్ ప్రాజెక్టును భారీగా ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనుండగా, నిర్మాణ బాధ్యతలు మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంటోంది.

మాస్ లుక్‌లో ఫస్ట్ లుక్ అదిరింది!

ఈ మూవీ నుంచి ప్రదీప్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముఖంపై గాయాల ముద్రలు, చేతిలో తాళితో బిగించిన పిడికిలి — ఇలా పూర్తిగా మాస్ గెటప్‌లో కనిపించిన ప్రదీప్ ఈసారి పూర్తి భిన్నమైన పాత్రలో కన్పించనున్నట్లు స్పష్టమవుతోంది.

పోస్టర్‌కు ‘‘డ్యూడ్‌కి దారి ఇవ్వండి… మీ అందరినీ గొప్పగా అలరించేందుకు వస్తున్నాడు’’ అనే క్యాప్షన్ హైప్‌ను రెట్టింపు చేసింది.

దర్శకుడిగా కీర్తిశ్వరన్ పరిచయం, హీరోయిన్ మమిత బైజు

ఈ సినిమాతో కీర్తిశ్వరన్ అనే యువ దర్శకుడు పరిచయం అవుతుండగా, ‘ప్రేమలు’ ఫేం మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటుడు శరత్ కుమార్ ముఖ్య పాత్రలో కనిపించనుండగా, రోహిణి మోలెటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం వంటి నటులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

దీపావళికి థియేటర్లలోకి – ఐదు భాషల్లో విడుదల

సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు

, , ,
You may also like
Latest Posts from