ఇవాళ రేపు, పెద్ద చిన్న సినిమా అయినా పెద్ద సినిమా ఓటిటి లెక్కలే కీలకం. ఓటిటి డీల్స్ క్లియర్ కానిదే రిలీజ్ కు రావటం లేదు. ఈ క్రమంలో ఈ వారం రిలీజ్ అవుతున్న ప్రియదర్శి ‘కోర్ట్’ , కిరణ్ ‘దిల్ రూబా’ ఓటిటి లెక్కలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి. ఏ సినిమా ఎంతకు అమ్ముడుపోయిందో చూద్దాం.
మొదటి నుంచి తన ప్రాజెక్టు కోర్ట్ కు క్రేజ్ తేవటంలో హీరో నాని ముందు ఉన్నాడు. అందుకే కోర్ట్ చిత్రం విడుదలకు ముందే నాని లాభాల్లో ఉన్నాడు. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓటీటీ హక్కుల్ని దాదాపు రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది చిన్న సినిమాకు పెద్ద రేట్. సినిమా బడ్జెట్ మొత్తం ఓటీటీతో కవర్ చేసేసినా లాభాల్లో ఉన్నట్టే ్ని తెలుస్తోంది.
మరో ప్రక్క కోర్ట్ సినిమా శాటిలైట్ కూడా అయిపోయింది. ఈటీవీ విన్ దాదాపు రూ.2.5 కోట్లకు శాటిలైట్ దక్కించుకొందని తెలుస్తోంది. అంటే థియేటర్ రెవిన్యూ మొత్తం లాభమే.
ఇక కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘దిల్ రూబా’ పరిస్థితి రివర్స్ లో ఉంది. ఈ సినిమాకు దాదాపు రూ.15 కోట్లు ఖర్చు పెట్టి భారీగానే చేసారు. దానికి తోడు క తరవాత వస్తున్న సినిమా అయినా అనుకున్న స్దాయిలో క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. దాంతో ఓటీటీ డీల్ మాత్రం ఇంకా క్లోజ్ కాలేదని తెలుస్తోంది. దాదాపు రూ.4 కోట్లకు ఓటీటీ డీల్ సెట్ అవ్వొచ్చని అంచనా.
అయితే ఇప్పటికే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రూపంలో కొంత మొత్తం వచ్చింది. నైజాంలో మైత్రీ మూవీస్ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. కాబట్టి రిలీజ్ బాగానే ఉంటుంది.