నిర్మాతలు ఎక్కడెక్కడ నుంచో డబ్బులు తెచ్చి సినిమాలు చేస్తూంటారు. ఆ సినిమాలు సక్రమంగా షూటింగ్ జరుపుకుని, రిలీజ్ అయితే ఏ సమస్యా రాదు. అయితే హీరోనో మరొకరో ఇబ్బంది పెట్టడం మొదలెడితేనే అసలు సమస్య వస్తుంది. ఇప్పుడు ధనుష్ తమను ఇబ్బంది పెడుతున్నాడంటూ ఓ నిర్మాణ సంస్ద ట్వీట్ చేసింది.
నటుడిగా, మరోవైపు డైరెక్టర్ గా ఇంకోవైపు నిర్మాతగా ఎంతో బిజీగా ఉన్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఇడ్లీ కడై, కుబేరతో పాటూ ధనుష్ బాలీవుడ్ లో ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తేరే ఇష్క్ మైన్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఫైవ్ స్టార్ సంస్థ నిర్మిస్తోంది.
#RKSelvamani @AakashBaskaran @DawnPicturesOff @TFPCTN pic.twitter.com/Ns3ywZ6ToR
— Five Star Creations LLP (@5starcreationss) March 31, 2025
ఈ సినిమాలో నటించడానికి ధనుష్ గతేడాది సెప్టెంబర్ 6న డబ్బులు తీసుకున్నారని, కానీ ఇప్పటివరకు తమకు కాల్షీట్స్ ఇవ్వలేదని, దాని వల్ల తామెంతో బాధ పడుతున్నామని ఫైవ్ స్టార్స్ సంస్థ షేర్ హోల్డర్ కలై సెల్వి ఓ లేఖను రిలీజ్ చేస్తూ ధనుష్ పై సంచలన ఆరోణలు చేశారు.
ఇడ్లీ కడై షూటింగ్ ఆగకుండా పూర్తి చేయాలని డాన్ పిక్చర్స్ ఆకాష్ అన్నారని, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 30 నాటికి తమకు డేట్స్ కేటాయిస్తారని చెప్పారని, కానీ ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని కలై సెల్వి ఆ లెటర్ లో పేర్కొన్నారు.
తమకు న్యాయం అందించే సంఘాలే లేవా అంటూ ప్రశ్నిస్తున్న కలై సెల్వి, వడ్డీకి డబ్బులు తీసుకుని నిర్మాతలు సినిమాలు చేస్తారని, వారి బాధ మీకెప్పుడు తెలుస్తుందని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా తమకు న్యాయం జరగాలని కోరారు. ధనుష్ పై ఆరోపణలు చేస్తూ ఫైవ్ స్టార్ క్రియేషన్స్ సంస్థ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.